Chiranjeevi Next Movie After Vishwambhara : ‘విశ్వంభర’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరెకెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా వస్తుందని నిర్మాతలు ప్రకటించారు.

అయితే అల్లు అర్జున్ పుష్ప-2.. రాంచర్ గేమ్ ఛేంజర్ మూవీల కోసం చిరంజీవి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. ఈక్రమంలోనే ‘విశ్వంభర’ సమ్మర్ కానుకగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బీజీగా ఉంది.
విశ్వంభర (Vishwambhara) హీరోయిన్స్..
‘విశ్వంభర’లో చిరుకు జోడిగా వెటరన్ బ్యూటీఫుల్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. విశ్వంభరలో ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితర యంగ్ భామలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నెక్ట్ ప్రాజెక్టుపై ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే చిరంజీవి ఓ యంగ్ డైరెక్టర్ తో తన తదుపరి సినిమాను చేయబోతున్నారనే ప్రచారం ఫిల్మ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన డబ్ల్యూ మూవీతోనే టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబోలో ‘దసరా’ మూవీని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. నానిని వంద కోట్ల హీరో క్లబ్ లో ‘దసరా’ మూవీ నిలిపింది. మరోసారి వీరద్దరి కాంబోలోనే ‘ప్యారడైజ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi Next Movie దసరా డైరెక్టర్ తో..
ఇదిలా ఉంటే ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి నెక్ట్ మూవీ ఉండనుంది. ఇప్పటికే దర్శకుడు చిరంజీవికి కథను విన్పించారని త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తే మాత్రం ప్రేక్షకులకు పునకాలు లోడింగ్ అవడం ఖాయంగా కన్పిస్తోంది. మరీ ఇందులో వాస్తవమెంత ఉందోనే త్వరలోనే క్లారిటీ రానుంది.
Read Latest Entertainment News and Latest News Updates

చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల సినిమా అప్ డేట్..
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమా త్వరలో వస్తుందనే ప్రచారం నిజమైంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన ఎక్స్ లో వెల్లడించారు.
ప్రామీస్.. ఫ్యాన్ బాయ్ తాండవం పేరుతో చిరంజీవి సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. కేవలం ఒక చేతిని మాత్రమే పోస్టర్లో రిలీవ్ చేశారు. చేతి నిండా రక్తపు మరకలతో కన్పించింది. ఊర మాస్ లెవల్లో ఫైట్ తర్వావ వచ్చే సీన్ అని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
ఏదిఏమైనా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి కాంబోలో సినిమా రానుండటంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. ‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి సినిమా డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ తో ఉంటుందని క్లారిటీ రావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.