- Actress Pragya Nagra ప్రైవేట్ వీడియోలు లీక్.. అభిమానుల్లో కలవరం
- నటీనటుల పాలిట శాపంగా మారిన డీప్ ఫేక్ టెక్నాలజీ
- ఏది ఒరిజనల్ వీడియోనో.. ఏది ఫేకో తెలియని పరిస్థితి..!

Tamil Heroine Pragya Nagra : తమిళ హీరోయిన్ ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీకైనట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన వీడియోలను దుండగులు సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పగ్యా నగ్రా అభిమానుల్లో కలవరం మొదలైంది.
ఈ వార్తల నేపథ్యంలో ప్రగ్యా నగ్రా (#pragyanagra) హ్యష్ ట్యాగ్ ‘ఎక్స్’లో ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రగ్యా నగ్రా (Actress Pragya Nagra) తమిళ సినిమాలతో ఇండస్ట్రీ పరిచయమైంది. 2022లో విడుదలైన ‘వరలారు ముక్కియం’లో జీవా సరసన నటించింది. ఇందులో మలయాళీ అమ్మాయి పాత్రలో కన్పించింది. 2023లో మలయాళ చిత్రం ‘నదికళిల్ సుందరి యమునా’ అనే సామాజిక-రాజకీయ నాటకంలో కన్నడ అమ్మాయి పాత్రను పోషించింది. తెలుగులోనూ ఈ ఏడాది ‘లగ్గం’ (Laggam Movie) సినిమాలో నటించింది.

ప్రగ్యా నగ్రా మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. తరచూ చెన్నైకి వెళ్ళిరావడంలో నటనపై అభిరుచి పెంచుకుంది. చివరికి చైన్నైకి మకాం మార్చివేసి నటిగా మారిపోయింది.
ఏఐ టెక్నాలజీ (AI Technology) రాకతో డీప్ ఫేక్ (Deep Fake Videos) వీడియోలు ఇటీవల సంచలనంగా మారాయి. గతంలో హీరోయిన్ రష్మిక మందన, ఆలియా భట్ వంటి హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. పెరుతున్న సాంకేతిక హీరోయిన్స్ పాలిట శాపంగా మారుతోంది. ఏది ఒరిజనల్ వీడియోనో.. ఏది ఫేకో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం లైక్స్ షేర్స్ కోసం దుండగులు ఇటువంటి చర్యలు పాల్పడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.
Read Latest Entertainment News and Latest News Updates
ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన ప్రగ్యా నగ్రా..
సోషల్ మీడియాలో తన పేరిట వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోపై హీరోయిన్ ప్రగ్యా నగ్రా స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ట్విట్టర్ వేదికగా తెలిపింది.
‘‘మళ్లీ చెబుతున్నా.. ఆ వీడియో నాది కాదు.. ఇదో పీడకల అయితే బాగుండేది.. టెక్నాలజీ మన జీవితాలకు ఉపయోగపడాలి తప్ప దుర్భరం చేయకూడదు.. ఇలాంటి ఏఐ కంటెంట్ ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారిపై జాలి వేస్తోంది.. నాకు అండగా నిలిచినవారందరికీ థ్యాంక్స్.. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు..’ అంటూ ప్రగ్యా నగ్రా సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేసింది.