ఈ నెంబర్లతో జాగ్రత్త అంటున్న సైబర్ క్రైం పోలీసులు
పలు ప్రమాదకర నెంబర్లు విడుదల
Cyber Crime Alert News Latest : మీ ఫోన్ కు మిస్ కాల్ వచ్చిందని తిరిగి కాల్ చేశారంటే మీరు చిక్కుల్లో పడ్డట్లే. గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను అట్మెంట్ చేయడం వల్ల మీ ఫోన్ క్షణాల్లో హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తమకు వచ్చిన ఫిర్యాదులు, ప్రాథమిక విచారణలో తేలిక అంశాల మేరకు గుర్తించిన పలు అనుమానిత మరియు కోడ్ తో వచ్చే పలు ఫోన్ నెంబర్లను తాజాగా విడుదల చేశారు. ఈ నెంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తే తిరిగి ఫోన్ చేయకపోవడమే మంచిదని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.
90 లేదా #09 కూడా (Alert News)..
ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90 లేదా #09ను డయల్ చేయమంటే చేయొద్దని సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ సిమ్ ను వాళ్లు యాక్టివేట్ చేసుకునే అవకాశముంది. ఆ నెంబర్లతో నేరాలకు పాల్పడి మిమ్మల్ని ఇరికించే అవకాశముందని పోలీసులు ముందుస్తుగా హెచ్చరిస్తున్నారు.

ఈ కోడ్లతో వచ్చే నెంబర్లతో జాగ్రత్త..
+375(బేలారస్)
+371(లాటివ)
+381(సెరబియా)
+563 (వలవరైసో )
+370 (విలనియస్)
+255(టాంజానియా)
అస్సలు ఎత్తకూడని నెంబర్లు..
+94777455913,
+37127913091,
+37178565072,
+56322553736,
+3705222959,
+255901130460
ఈ ఫోన్ నెంబర్ల సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతోపాటు తెలిసిన వారికి తెలియజేసి అప్రమత్తం చేయాలని సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు.
Read Latest Technology News and Latest News Updates