Atal Bihari Vajpayee Birth Anniversary : భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతిని కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 2025 డిసెంబర్ 25న అటలీ బిహారీ వాజ్ పేయ్ వందో జయంతిని పురస్కరించుకొని బీజేపీ నేతలు, ఆయన అభిమానులు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధర్యంలో వివిధ మోర్చాల అధ్యక్షులు ఆయా జిల్లా, మండల, గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
వాజ్ పేయ్ శత జయంతిని ఏడాదిపాటు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్ఛ భారత్, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, మండలాల్లో ర్యాలీలు, బూత్ లెవల్లో బీజేపీ నేతలు, ఆయన అభిమానులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

సబ్బుబిళ్ళపై వాజ్ పేయ్ చిత్రం.. అద్బుతంగా ఉందంటూ నెటిజన్ల కితాబు..
డిసెంబర్ 25న వాజ్ పేయ్ శతజయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణానికి చెందిన వనప్రేమి అవార్డు గ్రహీత గోకా రామస్వామి ఘనంగా నివాళ్లర్పించారు. సబ్బు బిళ్ళపై వాజ్ పేయ్ ముఖ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిద్దిద్దారు. దీని చూసిన నెటిజన్లు ఆయన కళా నైపుణ్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
- వాజ్ పేయ్ ప్రస్థానం..
అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్ లో ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో పట్టభద్రుడయ్యారు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందాడు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

వాజ్ పేయ్ (Atal Bihari Vajpayee )అంటే గుర్తొచ్చేది..
అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరు చెప్పగానే 1998 పోఖ్రాన్ అణు పరీక్ష.. 1999 కార్గిల్ యుద్ధం.. 1999లో ఢిల్లీ-లాహోర్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభం లాంటి చారిత్రాత్మక సంఘటనలు ప్రతీ ఒక్కరికి గుర్తుకొస్తాయి. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తొలిసారి హిందీలో ప్రసంగించిన నేతగానూ వాజ్ పేయి కీర్తిని గడించారు.
- రాజకీయ జీవితం..
ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. 1957లో తొలిసారి ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ నుంచి జన్ సంఘ్ టికెట్ పై గెలిచి తొలిసారి లోక్ సభలో అడుగు పెట్టారు. గ్వాలియర్.. న్యూఢిల్లీ.. లక్నో తదితర ప్రాంతాల నుంచి లోక్ సభకు పదిసార్లు ఎన్నికయ్యారు.
- విదేశాంగ మంత్రిగానూ..
ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జనాతా పార్టీ ఘన విజయం సాధించింది. నాటి మొరార్జీ భాయ్ దేశాయ్ నేతృత్వంలో ప్రభుత్వంలో వాజ్ పేయి విదేశాంగ మంత్రిగా పని చేశారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాజ్ పేయి ఎనలేని కృషి చేశారు.
బీజేపీలో కీలక నేతగా..
1990లో దశకంలో వాజ్ పేయ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 1996లో కేంద్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో వాజ్ పేయి కేవలం 13రోజులపాటు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. నాడు పార్లమెంట్ లో పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది.
LOCAL BODY ELECTION కొత్త ఏడాదిలో ‘స్థానిక’ సమరానికి ‘సై’
- ప్రోఖ్రాన్ అణు పరీక్ష..
అనంతరం 1998లో వాజ్ పేయ్ మళ్లీ ప్రధాని పదవీ చేపట్టారు. ఆ తర్వాత 1999-2004 వరకు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే పోఖ్రాన్ అణు పరీక్ష జరిగింది. అగ్రరాజ్యం అమెరికాకు భారతదేశం తక్కువేమి కాదని నిరూపించారు.
- కార్గిల్ యుద్ధం..
కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ను మట్టి కరిపించేలా చేసి ప్రతీ భారతీయుడు గర్వపడేలా వాజ్ పేయ్ చేశారు. ఢిల్లీ-లాహోర్ సర్వీస్ ను ప్రారంభించి భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించారు. 2001లో పార్లమెంట్ భవనంపై దాడి జరిగిన సమయంలోనూ వాజ్ పేయే ప్రధానిగా ఉన్నారు.
- అద్భుతమైన ప్రసంగాలు..
అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రసంగిస్తుంటే ప్రజలంతా అలా చూస్తుండి పోయేవారు. అంతలా ఆయన తన ప్రసంగంతో ప్రజలను మెస్మరైజ్ చేసేవారు. సందర్భోచితమైన చమత్కారాలతో ఆయన ప్రసంగం ఉండేది.
- ఐక్యరాజ్య సమితిలో హిందీ ప్రసంగం..
ఐక్య రాజ్య సమతి జనరల్ అసెంబ్లీలో తొలిసారి హిందీలో మాట్లాడిని ప్రతీఒక్కరినీ ఆయన ఆశ్చర్యపరిచారు. వాజ్ పేయ్ సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ ఆయనకు 27 మార్చి 2015న దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రధానం చేసింది.
- గుడ్ గవర్నెస్ డే..
వాజ్ పేయ్ పుట్టిన రోజును కేంద్రం ప్రతియేటా గుడ్ గవర్నెస్ డేగా నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ వాజ్ పేయ్ పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని 23 రోజులపాటు వాజ్ పేయ్ జైలు జీవితం గడిపారు.
- 2018 ఆగస్టు 16న..
అనారోగ్య కారణాలతో 2018 ఆగస్టు 16 న సాయంత్రం 5:05 కు అటల్ బిహారీ వాజపేయి ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు.
Read Latest National News and Latest News Updates