Bajaj E-rick Launch : దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఈ ఏడాదిలో ఈ-రిక్షా విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈవీ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని బజాజ్ కంపెనీ భావిస్తోంది.

Bajaj E-rick Auto
Bajaj E Auto | Mega9.in

వచ్చే నెలాఖరు లోగా ఈ-రిక్షా కోసం అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్ తీసుకుంటామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. నెలకు 45,000 వాహనాలను మార్కెట్లోకి తీసుకు రావాలనే లక్ష్యంతో పని చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ-రిక్ (Bajaj E-rick) పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్న బజాజ్..

ప్రస్తుత ఆర్థిక సంవత్స రం ముగిసేలోగా ‘ఈ-రిక్’ పేరుతో కొత్త వాహనాలు తీసుకొస్తామన్నారు. రిక్షా సెగ్మెంట్లో పూర్తిగా కొత్త ట్రెండ్ ను ఇది సెట్ చేస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొనుగోలుదారులతోపాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు.

ఏప్రిల్ తొలి వారంలో వాహనాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు రాకేశ్ శర్మ చెప్పారు. ఈ-రిక్ వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త వ్యాపారాన్ని తీసుకురావాలని భావిస్తున్నామని అన్నారు.

Bajaj e rick mileage
Bajaj E Rick Mileage | Mega9.in

కాగా గతేడాది ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగంలో 6లక్షల 32వేల 634 వాహనాల అమ్మకాలు జరిగాయి. ఇది ఇప్పటివరకు రికార్డు స్థాయి సేల్స్. గతేడాది కంటే 57శాతం అధికం.

వాహన్ డేటా ప్రకారం (ఫిబ్రవరి 6, 2025 నాటికి), ఈ విభాగంలో మొత్తం 424 కంపెనీలు ఉన్నాయి. వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, అతుల్ ఆటో, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీలే ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి.

Auto Heritage Fest : వీఎన్ఆర్లో.. ఆటో హెరిటేజ్ ఫెస్ట్-2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sahiba Bhasin : ట్రెడిషన్ సారీలో సాహిభా అందాలు Ayesha Serial Actress : అందమా.. అయస్కాంతమా..