Bharat Biotech First-ever vaccine : ప్రపంచంలోనే తొలిసారిగా పాడిపశువుల చర్మ సంరక్షణ కోసం వ్యాక్సిన్ తయారైంది. లంపీ స్కిన్ డిసీజ్(ఎల్ఎస్టీ) నివారణకు భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ కి సీడీఎస్సీఓ అనుమతి లభించింది.

కర్ణాటక రాష్ట్రంలోని మల్లూరులో జంతువుల ఆరోగ్యంపై భారత్ బయోటెక్ గ్రూప్ కంపెనీ బయోవెట్, పాడి పశువులకు సంబంధించిన లంపీ స్కిన్ డిసీజ్ నివారణకు తయారుచేసిన దివా మార్కర్ వ్యాక్సిన్ కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) తాజాగా ఆమోదించింది.
మొట్టమొదటి వాక్సిన్ రూపొందించిన బయోటెక్ (Bharat Biotech)..
ప్రపంచంలోనే ఇది అత్యంత సురక్షితమైన తొట్టతొలి వ్యాక్సిన్ అని భారత్ బయోటెక్ వెల్లడించింది. త్వరలో అందుబాటులోకి రానున్న బయోలంప్ వ్యాక్సిన్ పాడి పశువుల సంరక్షణకు తయారు చేసిన ప్రపంచంలోని ఏకైక మార్కర్ వ్యాక్సిన్ అని పేర్కొంది.

టీకా నాణ్యత, భద్రతతో కూడిన అంశాలను ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్టిట్యూట్లో విస్తృతంగా పరీక్షించినట్లు బయోవెట్ వెల్లడించింది. ఇది ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పేర్కొంది.
అటెన్యూయేటెడ్ మార్కర్ వ్యాక్సిన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ మరియు భారత్ బయోటెక్ బయోవెట్ సహకారంతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
డాక్టర్ బీఎస్ త్రిపాఠి, డాక్టర్ నవీన్ కుమార్, ఎస్ఆర్సీఈ శాస్త్రవేత్తలు మూడేళ్ళు చేసిన పరిశోధన ఫలితంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది. ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారని తెలిపింది.
Bajaj E-rick : ఈ-రిక్షా విభాగంలోకి బజాజ్.. ట్రెండ్ సెట్ చేస్తుందా