Cashless Treatment Scheme for Road Accident Victims: కేంద్రంలోని ఎన్టీఏ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. ప్రతినిత్యం వేలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతుండటంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం మోదీ సర్కార్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది.

Cashless Treatment Scheme
Cashless Treatment Scheme

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి ఈ పథకంలో భాగంగా రెండు లక్షల రూపాయలు.. గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకు ఖర్చులను ఇకపై కేంద్రమే భరించనుంది.

ప్రమాదాల నివారణలో భాగంగానే నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని నితిన్ గడ్కరీ వ్యక్తం చేశారు.

ప్రమాద బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలను కేంద్రం భరిస్తుందన్నారు. ఇది తొలి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారమిస్తే ఈ పథకం కింద నగదు రహిత చికిత్సకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ స్కీమ్ ను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ (Cashless Treatment Scheme) అమలు..

2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనునున్నట్ల వెల్లడించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆదుకునేందుకు రూ. 2లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్లు చెప్పారు.

పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, బాధితులను ఆదుకోవడమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు.

గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8లక్షల మందిపైగా చనిపోయారని వివరించారు. వీరిలో 30వేల మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతిచెందారని తెలిపారు. మృతుల్లో 66శాతం మంది 18 నుంచి 34 ఏళ్ళ మధ్యవారే ఉండటం శోచనీయమన్నారు.

మరోవైపు స్కూల్స్, కళాశాలల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తప్పుల వల్ల 10వేల మంది పిల్లలు మరణించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల 3 వేల మంది మృతిచెందారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Read Latest National News and Latest News Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *