Y-plus Security to Tamil Star Hero Vijay : ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ కి కేంద్రం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

హీరో విజయ్ గతేడాది టీవీకే పార్టీని స్థాపించారు. తమిళనాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయ్ పార్టీకి ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ ఇటీవల వెల్లడింది. తాము చేపట్టిన సర్వేలో టీవీకే పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.
తమిళనాడులో విజయ్ పార్టీకి ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మరోవైపు తళపతి విజయ్ కు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారముంది.
తమిళనాడులోనే విజయ్ (Y-plus Security) కి ‘వై’ ప్లస్ భద్రత
ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ కు కేంద్రం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ భద్రత తమిళ నాడులో మాత్రమే లభించనుంది. వై ప్లస్ సెక్యురిటీలో 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పించనున్నారు.
ఇందులో ఇద్దరు నుంచి నలుగురు ఎన్ఎస్ఓ కమాండోలు, మిగతా వారు పోలీసులు ఉంటారు. విజయ్ కి కేంద్రం భద్రత కల్పించడంతో ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Microsoft Office : మైక్రోసాప్ట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం
Jio Hotstar : రెండు ప్రపంచాల కలయిక ‘జియో హాట్ స్టార్’