Champions Trophy 2025 Team India vs Bangladesh : చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీంఇండియా ఘన విజయంతో మొదలుపెట్టింది. టీంఇండియా బౌలర్లు సమష్టిగా రాణించగా.. బ్యాటర్లు అదిరిపోయే భాగస్వామ్యాలు నెలకొల్పడంతో బంగ్లాదేశ్ పై భారత్ గట్టిగా పోరాడాకుండానే విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 228 పరులకే అలౌట్ అయింది. భారత బౌలర్లు ధాటికి బంగ్లాదేశ్ 35 పరులకే ఐదు వికెట్లు కొల్పోయింది. ఒకనొక సమయంలో 100 పరుగులు చేయడం కూడా కష్టమే అన్పించింది.
ఈ సమయంలో తౌహిద్ హృదయ్.. జాకర్ అలీలు సంచలన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని మహ్మద్ షమీ విడదీశాడు. జాకర్ అలీ (68) అవుటయ్యాడు.
ఆ తర్వాత 39 పరుగుల వ్యవధిలోనే మిగతా ఐదు వికెట్లను కొల్పోయింది. అయితే ఓవైపు వికెట్లు కోల్పుతున్న మరో ఎండ్ లో తౌహిద్ హృదయ్ (100) పోరాటాన్ని కొనసాగించాడు. శతకంతో అలరించాడు. ఆఖరి ఓవర్లో చివరి వికెట్ గా వెనుదిరిగాడు.
టీంఇండియా(Team India) శుభారంభం..
229 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీంఇండియాకు ఓపెనర్లు మంచి శుభారభాన్ని ఇచ్చారు. రోహిత్, గిల్ తొలి వికెట్ కు 69 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
వీరిద్దరు తమ ఫామ్ ను కొనసాగిస్తూ బౌండరీలతో అభిమానులను అలరించారు. ఈ జోడిని తస్కిన్ అహ్మద్ విడదీశాడు.
రోహిత్(41) అవుట్ అయిన తర్వాత వచ్చిన కోహ్లీ(22) గిల్ తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లీ భారీ స్కోరు నమోదు చేయడంలో విఫలమయ్యాడు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మరో ఎండ్ లో గిల్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
కేఎల్ రాహుల్ తో కలిసి గిల్ టీంఇండియాను విజయాతీరానికి చేర్చాడు. ఐదో వికెట్ కు వీరిద్దరు అజేయంగా 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈక్రమంలోనే గిల్ సెంచరీని పూర్తి చేశారు. 47 ఓవర్లో మూడో బంతిని రాహుల్ సిక్స్ గా మలిచి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. కాగా ఈ మ్యాచ్ లో షమీ ఐదు వికెట్లను తీశాడు.
ఈ ప్రదర్శనతో షమీ అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 104 మ్యాచుల్లో 202 వికెట్లు తీశాడు. కేవలం 5,126 బంతుల్లోనే షమీ ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అత్యధిక వికెట్లు 60 తీసిన బౌలర్ గానూ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు జహీర్ ఖాన్ (59 వికెట్లు) పేరిట ఉంది.
ఛాంపియన్ ట్రోపీలో జడేజా (2013లో 5/35) తర్వాత షమీ (5/53) అత్త్యుత్తమ గణాంకాలను నమోదయ్యాయి.
Miss World 2025 : పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ
WPL Delhi Vs UP : ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ
RBIDATA APP : ఆర్బీఐ డేటా యాప్ ప్రారంభం