Microsoft Office in Gachibowli : హైదరాబాద్లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 13న గచ్చిబౌలిలో మైక్రోసాప్ట్ కొత్త క్యాంపస్ ను ఆయన ప్రారంభించారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అవుతుందని అన్నారు.
మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని అన్నారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణ సర్కార్ మధ్య అవగహన ఒప్పందం కుదిరిందన్నారు.
మైక్రో సాప్ట్ (Microsoft Office) తో అవగాహన ఒప్పందం..
దీని వల్ల రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఏఐని ఉపయోగించుకుంటామని తెలిపారు.
ఈ పెట్టుబడి తమ స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతాన్ని చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్ వర్క్ యాక్సెస్ ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ సహ కారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందన్నారు.
ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు.
Health Tourism Hub : హెల్త్ టూరిజం హబ్ గా తెలంగాణ