Gongadi Trisha and CM Revanth Reddy : అండర్-19 మహిళా వరల్డ్ కప్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న తెలంగాణ క్రికెటర్లు గొంగడి త్రిషకు రూ. కోటి, ధృతి కేసరికి రూ.10 లక్షల నజరానాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అండర్-19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినిలకు సైతం రూ. 10 లక్షల చొప్పున రివార్డును ఇస్తున్నట్లు వెల్లడించారు. నేడు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు.

జాతీయ స్థాయిలో త్రిష (Gongadi Trisha) రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన సీఎం
రాబోయే రోజుల్లో టీంఇండియా జాతీయ స్తాయిలో మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ క్రిడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.
సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసే నారెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం తదితరులు ఉన్నారు.
Under-19 World Cup 2025 : మహిళల ప్రపంచ కప్ విజేత భారత్