Young India Schools in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, స్థలాల సేకరణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 14న విద్యాశాఖ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.
105 నియోజకవర్గాల్లో (Young India Schools) యంగ్ ఇండియా స్కూల్స్..
యంగ్ ఇండియా స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వచ్చే రెండేళ్ళలో 105 నియోజకవర్గాల్లో పాఠశాలల నిర్మాణం పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

స్థలాల కేటాయింపులు పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని సూచించారు.
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి త్వరితగతిన స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందించాలని కోరారు.

అదేవిధంగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో అధునాతన సదుపాయాలు, మౌలిక సదుపాయాల కల్పనకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకొని ఇతర సదుపాయాలపై ప్రణాళికలను సిద్దం చేయాలని సూచించారు. మహిళా విశ్వ విద్యాలయానికి తగు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Microsoft Office : మైక్రోసాప్ట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం