Donald Trump and Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 ప్రచారం హోరాహోరీగా సాగింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్న సమయంలో అనుహ్యంగా డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ బరిలోకి వచ్చారు. జో బిడైన్ స్థానంలో వచ్చిన కమలా హారిస్ కు ట్రంప్ కు మధ్య టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా ప్రచారం సాగింది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎలన్ మస్క్ ట్రంప్ కు మద్దతుగా ప్రచారం చేశారు.

గత వారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడికాగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump ) అధ్భుత విజయం సాధించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడి హోదాలో వైట్ హోస్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈక్రమంలోనే డోనాల్డ్ ట్రంప్ కోటరిలో ఎవరికీ ప్రాధాన్యం దక్కుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా ఎలాన్ మస్క్ కు ట్రంప్ ఏ పదవీ కట్టబెడుతారనే విషయంపై అంతా చర్చించుకున్నారు.
ఈ తరుణంలోనే డోనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ బాధ్యత వహించబోయే పదవీపై కీలక ప్రకటన చేశారు. అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ విభాగానికి ఎలాన్ మస్క్ అధ్యక్షత వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. ప్రవాసీ భారతీయుడు వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ వివరించారు.

వీరిద్దరు తమ ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గదర్శనం చేస్తారన్నారు. ‘సేవ్ అమెరికా’ ఉద్యమానికి కీలకమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు.. వృథా వ్యయాల తగ్గింపు.. ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి అంశాలపై మార్పులను ఎలన్ మస్క్, వివేక్ రామస్వామిలు చేపడుతారని డోనాల్డ్ ట్రంప్ వివరించారు.
కాగా ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కోసం భారీగా ప్రచారం చేశారు. పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటిండంతోపాటు స్వయంగా ఆయనే ప్రచారం చేశారు. ట్రంప్ గెలుపు కోసం మస్క్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే డోనాల్డ్ ట్రంప్ ‘విక్టరీ స్పీచ్’లో సైతం ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ఒక అధ్భుతమైన మేధావి అని కొనియాడారు. మన కొత్త నక్షత్రం ఎలాన్ మస్క్ అంటూ కితాబిచ్చారు. తనతో కలిసి కొన్ని ప్రాంతాల్లో మెగా ప్రచారం నిర్వహించిన విషయాన్ని సైతం ట్రంప్ గుర్తు చేశారు.
IPL 2025 Mega Auction : ఆ బౌలర్ కోరికను చెన్నై తీరుస్తుందా?