DRINKER Sai Movie : డ్రింకర్ సాయి’.. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది దీనికి ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మూవీ డిసెంబర్ 27న (Drinker Sai Movie Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మ, ఐశ్వర్యశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కిరణ్ తిరుమలశెట్టి డైరెక్షన్లో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్రింకర్ సాయి (Drinker Sai Trailer) మూవీ ట్రైలర్ ను హైదరాబాద్లో రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా (Drinker Sai movie cast) హీరో ధర్మ మాట్లాడుతూ “డ్రింకర్ సాయి‘ ట్రైలర్ చూసి తనను కొంతమంది తిడుతున్నారని అన్నారు. కానీ సినిమా పూర్తిగా చూస్తే ఒక్కడు కూడా తిట్టరని చెప్పారు.

డ్రింకర్ సాయి ప్రతీఒక్కరిని నచ్చుతుందని బల్లగుద్ది చెబుతున్నానని చెప్పారు. కొంతమంది పెద్ద వయసు వాళ్లకు షో వేశామని.. వాళ్ళంతా బాగుందని చెప్పారని ధర్మ అన్నారు.
అనంతరం హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ సినిమా కోసం ‘టీమ్ అంతా ఎంతో డెడికేట్ గా వర్క్ చేశారని తెలిపారు. సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ.. “డ్రింకర్ సాయి’ కథ చాలా బాగుందని జీకే మోహన్ చిరంజీవికి మెసేజ్ పంపిస్తే ఆయన ఒకే అని రిప్లై ఇచ్చారని తెలిపారు.

అలా మెగాస్టార్ అంగీకారంతోనే సినిమా మొదలైందని వివరించారు. ఆయన నో చెప్పి ఉంటే ఈ సినిమా ఉండేది కాదని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఇస్మాయిల్ షేక్, లహరీధర్, డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మి నటి, కిర్రాక్ సీత, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.
Read Latest Entertainment News and Latest News Updates
Read more : Pushpa-2 Bookings పుష్ప-2 ఆల్ టైం రికార్డు
డ్రింకర్ సాయి మూవీ (Drinker Sai Movie Review) ఎలా ఉందంటే..
ధర్మ, ఐశ్వర్య శర్మ జోడిగా ‘డ్రింకర్ సాయి’.. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కించారు. ఈ మూవీ డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విషయానికొస్తే..
అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు తనకు నచ్చిన అమ్మాయి వెంట పడటం.. చివర్లో అమ్మాయి అతన్ని అపార్థం చేసుకుందని తెలుకొని తిరిగి ప్రేమించడం లాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. డ్రింకర్ సాయి సినిమా కూడా అలాంటిదే. అయితే క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్స్ పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడం.. హీరో హీరోయిన్ వెంట పడటం కన్పిస్తుంది. ఇంటర్వెల్ కూడా చాలా సింపుల్ గానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో అదే నడుస్తుంది. చివరి అరగంట మాత్రం ఓ ఆశ్రమంలో కామెడీతో సాగి.. అనంతరం ఎమోషనల్ గా సాగుతుంది.
టైటిల్ చూసి బోల్డ్ సినిమా అనుకున్నారు కానీ మూవీలో పెద్దగా బోల్డ్ సీన్స్ ఏమి ఉండవు. కాకపోతే సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాగడం, చివర్లో ఎమోషన్ ప్లస్ గా మారింది. సెకండ్ హాఫ్ లో ఆశ్రమంలో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
హీరో పాత్ర చేసిన సాయి బాగా తాగే ఓ యువకుడి పాత్రలో బాగా చేసాడు. క్లైమాక్స్ లోనూ ఎమోషన్ పండించాడు. హీరోయిన్ ఐశ్వర్య శర్మ క్యూట్ గా కన్పించింది. సినిమాలో మంచి ఎమోషన్ ని పండించింది. ఎస్ఎస్ కాంచి, కిరాక్ సీత, రీతూ చౌదరి, సమీర్, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి, ఫన్ బకెట్ రాజేష్, భద్రం వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. దర్శకత్వం బాగున్నా కథనంలో అక్కర్లేని కామెడీ తగ్గించి ఉంటే కథ మరింత బలంగా ఉండేది. నిర్మాణ పరంగా బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కన్పిస్తుంది.
Drinker Sai సినిమా రేటింగ్ : 2.75 గా ఇవ్వొచ్చు.
Conclusion : ఈ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే గమనించగలరు.