Ramcharan Game Changer Updates : మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని డల్లాస్ లో గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి ఈవెంట్ నిర్వహించగా భారీ సక్సస్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ గేమ్ ఛేంజర్ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. గతంలో యూట్యూబ్లో ఉన్న పలు రికార్డులను గేమ్ ఛేంజర్ తన పేరిట లిఖించుకుంటోంది.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release Event) ను ఏపీలో నిర్వహించనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. జనవరి 4 లేదా 5 తేదిల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డేట్స్ ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈక్రమంలోనే జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించేందుకు ముహుర్తం ఖరారైంది.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో శనివారం సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు.

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ (Game Changer Pre Release) ఏర్పాట్లను పరిశీలించి మంత్రి..
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ లతో ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. మెగా అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు.
MAATA VINAALI SONG హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్
వీఐపీ భద్రత, ట్రాఫిక్ రద్దీ వంటి వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి కందుల దుర్గేశ్ అధికారులకు పలు సూచనలు చేశారు. బాబాయ్ – అబ్బాయ్ ఒకే వేదికపై సందడి చేయనుండటంతో అభిమానులకు కన్నులపండుగా ఉంటుందని ఆయన తెలిపారు.
శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా కియారా అడ్వాణీ, అంజలి హీరోయిన్లుగా ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కింది. నిర్మాత దిల్ రాజు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. పొలిటికల్ యాక్షన్ థిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది.
ఎస్.జె. సూర్య, సీనియర్ హీరో కమ్ నటుడు శ్రీకాంత్, సముద్ర ఖని, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Latest Entertainment News and Latest News Updates
Ram Charan Gamechanger Pre Release Event LIVE | Mega9.in
Game Changer Pre Release Event Rajahmundry Live Today | Ram Charan Speech | Pawan Kalyan Speech | Heroine Anjali Speech | Kiara Advani Speech | Dil Raju | Shankar
Video Credit : NTV