Viral Reels : రీల్స్ చేద్దామని నమ్మించి బాలిక మెడలో ఓ యువకుడు తాళి కట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విశాఖ శివారు ప్రాంతానికి చెందిన ఓ బాలిక సరదాగా రీల్స్ చేస్తూ ఇన్ స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న భార్గవ్ అనే యువకుడు బాలికతో పరిచయం పెంచుకున్నారు. తనకు కూడా రీల్స్ చేయాలని ఉందని సహకరించాలని ఆమెను కోరాడు.
రీల్స్ చేద్దామని బాలికను కైలాసపురం కొండ మీద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకెళ్లాడు. రీల్స్ లో భాగమని నమ్మించి సదరు బాలికకు భార్గవ్ తాళి కట్టాడు. కొద్దిరోజుల తర్వాత సింహాచలం తీసుకెళ్లి మరోసారి తాళికట్టి వివాహం చేసుకున్నాడు.
సోషల్ మీడియాలో (Viral Reels ) జోరుగా చర్చ..
ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వీరు విశాఖ పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువకుడిపై బాల్య వివాహా నిరోధక చట్టం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలికలు అప్రమత్తం ఉండాలని.. ఎవరినీ పడితే వారిని నమ్మి మోసపోవద్దంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Saraswati River Pushkaralu : కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు