దేశ రాజధాని ఢిల్లీలో గాలు కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో గూగుల్ నుంచి ఓ అద్భుమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ (Google Air View Plus) ఫీచర్ సహాయంతో గూగుల్ మ్యాప్ ద్వారా యూజర్లు తమ ప్రాంతంలోని ఎయిర్ క్వాలీటీ క్షణాల్లో తెలుసుకోవచ్చు.

Google Air View Plus Check Air Quality : ప్రపంచానికి గాలి కాలుష్య సమస్య పెను సవాలుగా మారుతోంది. అగ్రదేశాలు ఇప్పటికే కాలుష్య నివారణపై పలు చర్యలు చేపడుతోన్నారు. వీటికి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం కలిసి వస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం పొల్యూషన్ కంట్రోల్ పై ప్రపంచ దేశాలకు పలు సూచనలు చేస్తూనే ఆచరణలో చేసి చూపుతోంది.
ఇందులో భాగంగానే గత కొంతకాలంగా సోలార్ ఎనర్జీ, ఈవీ బ్యాటరీలతో పనిచేసే వాహనాలను ప్రోత్సాహిస్తోంది. కర్బన్ ఉద్ఘారాలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత కరోనా సమయంలో జనజీవనం స్తంభించిపోవడంతో గాలిలో కాలుష్యం తగ్గడంతోపాటు వాతావరణంలో ఆక్సిజన్ శాతం గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది.

కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ గాలి కాలుష్యం సమస్య మొదటికొచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఢిల్లీ లాంటి మెట్రోపాలిటిన్ సిటీల్లో గాలి కాలుష్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఢిల్లీలో పొలుష్యన్ ను కంట్రోల్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, వాహనాల రాకపోకలు తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోం వంటి వాటిని అమలు చేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ సైతం ఎయిర్ వ్యూ ప్లస్ పేరుతో ఆయా ప్రదేశాల్లోని ఎయిర్ క్వాలిటీని తెలుసుకునేలా ఒక ఫీచర్ ను తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్ తో ఇప్పటి వరకు ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడం, కొత్త ప్రాంతాలను సందర్శించేందుకు యూజర్లు వినియోగించుకునేవారు. అయితే తాజాగా గూగుల్ మ్యాప్ తో ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకునే సదుపాయాన్ని ఆ సంస్థ అందుబాటులో తీసుకొచ్చింది.

సరైన సమయంలో గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. దీని సహాయంతో యూజర్లు వారు ఉండే ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఎంత ఉందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలుగనుంది. ఇది ఏఐ ద్వారా పని చేయనుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 491 స్థాయికి చేరుకోవడంతో ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని గూగుల్ భావించింది. ఈక్రమంలోనే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఎయిర్ వ్యూ ప్లస్ లో ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకోవడం ఎలా?
- ముందుగా మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత సెర్చ్ బార్ లో ఏదైనా లోకేషన్ ట్యాప్ చేయాలి.
- దీని తర్వాత లోకేషన్ పక్కన నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కన్పిస్తుంది.
- దీనిపైన క్లిక్ చేస్తే టెంపరేచర్ కన్పిస్తుంది. దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కన్పిస్తుంది.
గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం క్లైమెట్ టెక్ సంస్థలు, ఆరన్సూర్, రెస్పిరల్ లివింగ్ సైన్సెస్ వంటి సంస్థలు కీలక భూమిక పోషించాయి. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సీఎస్టీఈపీ వంటివి ఈ ఫీచర్ ను చెక్ చేసి ధృవీకరించినట్లు తెలుస్తోంది.