Gulveer Singh National Record : భారత అథ్లెట్ గుర్వీర్ సింగ్ పురుషుల 10వేల మీటర్ల రేసును వలం 27:14.88 సెకన్లలో ముగించి జాతీయ రికార్డు నెలకొల్పాడు. గత సెప్టెంబర్లోనూ జపాన్లో జరిగిన 5వేల మీటర్ల రేసులోనూ 13:11.82సెకన్లతో తన రికార్డును మెరుగు పర్చుకున్నాడు.

Gulveer Singh 10thousand Meters National Record : భారత అథ్లెట్ గుర్వీర్ సింగ్ పురుషుల 10వేల మీటర్ల ఈవెంట్లో జాతీయ రికార్డును సృష్టించాడు. జపాన్లో హిచియోగి లాంగ్ డిస్టేన్స్ అథ్లెటిక్స్ లో రాణించిన గుల్వీర్ సింగ్ 10వేల మీటర్ల రేసులో విన్నర్ గా నిలిచాడు. ఈ రేసును కేవలం 27:14.88 సెకన్లలో ముగించాడు. కెన్యాకు చెందిన సామ్వెల్ మసాయి (27:17.78) సెకన్లు, గిల్బర్ట్ కిప్రోటిజ్ (27:19.35) సెకన్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన గర్వీర్ సింగ్ (Gulveer Singh)..
కాగా ఈ ఏడాది కాలిఫోర్నియా ఈవెంట్లో గిర్వీర్ 10వేల మీటర్ల రేసును 27:41.81 సెకన్లతో రికార్డును నెలకొల్పాడు. తాజాగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలుకొట్టాడు. గుల్వీర్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శన (27:14.88 సెకన్లు) సైతం ఇదే కావడం విశేషం.
గుల్వీర్ తన పేరిట ఉన్న సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శన చేసిన ఆసియా అథ్లెట్ గా గుల్వీర్ సింగ్ నిలిచాడు. అంతేకాకుండా ఆల్ టైం ఆసియా అథ్లెట్లలో 8వ స్థానంలో గుల్వీర్ నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 33వ అథ్లెట్ గా నిలిచారు.
గుల్వీర్ సింగ్ 2023 ఏడాదిలో జరిగిన హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 28:17.21సెకన్లతో రేసు పూర్తి చేసి కాంస్య పతకాన్ని గెలుపొందాడు. గుల్వీర్ ఐదు వేల మీటర్లు, 10వేల మీటర్ల రేసులో జాతీయ రికార్డులు నెలకొల్పాడు. జపాన్ అథ్లెటిక్స్ మీట్‌లో 13:11.82సెకన్లతో 5వేల మీటర్ల రేసులోనూ గుల్వీర్ జాతీయ రికార్డును మెరుగు పరుచుకున్న సంగతి తెల్సిందే.
Read more : IPL 2025 Auction హైయ్యెస్ట్ ధర పలికిన ప్లేయర్ ఎవరంటే