Hyderabad to Madinah Flight Service Launched Indigo : హైదరాబాద్ నుంచి మదీనా ప్లైట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ మదీనాకు తొలిసారి ఫ్లైట్ సర్వీసును ప్రారంభించింది.

ప్రతీ సోమవారం, గురువారం, శనివారం ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతినిధులు ప్రకటించారు. హైదరాబాద్-మదీనా ప్రయాణ సమయం సుమారు 5 గంటల 47 సమయం పడుతుంది.
హైదరాబాద్-మదీనా ఇండిగో తొలి సర్వీస్ ప్రారంభించిన అనంతరం ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పనికర్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సర్వీసుతో అంతర్జాతీయంగా కనెక్టవీటి మరింత సులువు అవుతుందన్నారు.
Hyderabad to Madinah Flight 6E 57 నంబర్ కలిగిన ఫైట్ సర్వీస్..
హైదరాబాద్-మదీనాకు మరియు మదీనా-హైదరాబాద్ కు 6E 57 నంబర్ కలిగిన విమానం ప్రతీ సోమ, గురు, శనివారాల్లో సేవలు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
మదీనాకు ఇండిగో తొలి విమాన సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించడమే కాకుండా.. హైదరాబాద్ ను ప్రపంచంలోని ఆధ్యాత్మిక నగరాలలో ఒకటైన మదీనాతో అనుసంధానించడంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందన్నారు.
Miss World 2025 : పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ
Jio Hotstar : రెండు ప్రపంచాల కలయిక ‘జియో హాట్ స్టార్’