Indirammaindlu Status Now : ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ వివరాలను తెలుసుకోవడం ఇకపై చిటికెలో పని. ఇందిరమ్మ ఇళ్ళు ఏ స్టేజ్ ఉందో తెలుసుకునేందుకు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మొబైల్ ఉంటే చాలు అరచేతిలో మీ అప్లికేషన్ వివరాలన్నీ పొందే అవకాశముంది.

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న పథకాల్లో ఇందిరమ్మ ఇళ్ళు ఒకటిగాత ఉంది. ఈ పథకానికి అర్హులైన వారంతా ప్రజాపాలన ధరఖాస్తుల సమయంలో అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెబుతోంది.
అయితే ఈ పథకంలో తమ పేరు ఉందా.. లేదా.. ఏ స్టేజీలో ఉంది అని తెలుసుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో దళారులు నమ్మి కొంతమంది మోసపోతున్నారు. ఈక్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ (Indirammaindlu Status) తెలుసుకోండి ఇలా..
- మీ వివరాలను తెలుసుకునేందుకు తప్పనిసరిగా మొబైల్ ఉండాల్సి ఉంటుంది.
- ముందుగా https://indirammaindlu.telangana.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ సెర్చ్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ ఆధార్ నంబర్.. మొబైల్ నంబర్/రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి.
- సర్వే కంప్లీట్ అయిందా.. ఎన్నో లిస్టులో ఉంది.. వంటి వివరాలు వస్తాయి.
- దరఖాస్తుదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ‘రైజ్ గ్రీవెన్స్‘పై క్లిక్ చేసి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది.
Young India Schools : యంగ్ ఇండియా పాఠశాలలపై సీఎం రివ్యూ