IPL 2025 mega Auction : ఇండియాలో క్రికెట్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా టీ20 వచ్చాక ఆటకు మరింత హైప్ వచ్చింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు బీసీసీఐ ఐపీఎల్ ఈవెంట్ ను ప్రవేశపెట్టింది. ఇది భారీ సక్సెస్ కావడంతో ప్రతియేటా ఐపీఎల్ ను నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే త్వరలో జరిగే ఐపీఎల్ 2025 మెగా ఈవెంట్ కు బీసీసీఐ అన్ని సన్నహాలు చేస్తోంది.

IPL 2025 mega Auction
I

ప్రపంచ క్రికెట్ మ్యాచులను తలదన్నేలా బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. ప్రతియేటా నిర్వహిస్తున్న ఐపీఎల్ ఈవెంట్ బీసీసీఐకి, ప్రాంచైజీలకు కాసులవర్షం కురిపిస్తోంది. అదేవిధంగా క్రికెట్ అభిమానులకు సైతం మంచి ఎంటటైన్మెంట్ ను అందిస్తుంది. ఈక్రమంలోనే ఐపీఎల్-2025 మెగా ఆక్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

IPL 2025 రిటైన్షన్ లిస్టు వెల్లడైన నేపథ్యంలో మెగా వేలంలోకి ఎవరెవరు వస్తారనేది క్లియర్ గా తెలిసిపోయింది. ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 24, 25 తేదిల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగనుంది. మొత్తం 1,574మంది క్రికెటర్లు మెగా వేలంపాటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో 1,165మంది ఇండియన్ ఆటగాళ్లు ఉండగా 409మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

భారత స్టార్ ఆటగాళ్లపై ప్రాంచేజీల కన్ను..

ఐపీఎల్ ప్రాంచైజీలు స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకునేందుకు పోటీపడే అవకాశముంది. ముఖ్యంగా భారత స్టార్ ఆటగాళ్ళపై కోట్లు కుమ్మరించే అవకాశం ఉండటంతో ఏ ఆటగాడికి హైయ్యస్ట్ ప్రైస్ వస్తుందనేది ఆసక్తిని రేపుతోంది. ఈసారి వేలంలోకి భారత క్రికెటర్లు పంత్, రాహుల్, శ్రేయస్ అయ్యార్, ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ సైతం ఉన్నారు. చెన్నై కింగ్స్ విజయాల్లో దీపక్ చాహర్ తనవంతు పాత్ర పోషించాడు.

పాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 2022లో 14కోట్లకు దక్కించుకుంది. తన స్వింగ్ బౌలింగ్ తో చెన్నై విజయాల్లో కీరోల్ ప్లే చేశాడు. అయితే ఆ తర్వాత గాయాల కారణంగా చాలా మ్యాచులకు దూరమయ్యాడు. ఆ తర్వాత పేలవఫామ్ తో జట్టుకు భారంగా మారిపోవడంతో అతడిని చెన్నై టీం 2025 ఐపీఎల్ లో రిటైన్ చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు.

IPL Deepak Chahar

దీంతో దీపక్ చాహర్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లోకి (IPL 2025 mega auction) రాక తప్పలేదు. అయితే అతడు మాత్రం మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తనను తిరిగి దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. గతంలో జరిగిన మెగా ఆక్షన్ లోనూ భారీ ధర చెల్లించి తనను చెన్నై టీం దక్కించుకుందని గుర్తు చేస్తున్నాడు. ఈసారి కూడా అదే జరుగనుందని వెల్లడించారు. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ మెగా ఆక్షన్ లో తనను తీసుకోకపోతే రాజస్థాన్ రాయల్స్ తన కోసం వేలం వేయాలని కోరుకుంటున్నట్లు దీపక్ చాహర్ చెప్పారు.

ఐదుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్..

కాగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురిని రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరియు జడేజాకు రూ.18కోట్లు, లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు రూ. 13కోట్లు మరియు ఆల్ రౌండర్ శివమ్ దూబే రూ.12 కోట్లు ఇచ్చి చెన్నై రిటైన్ చేసుకుంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగు కోట్ల రూపాయలతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఈసారి బరిలోకి దిగబోతున్నాడు.

3 thoughts on “IPL 2025 Mega Auction : ఆ బౌలర్ కోరికను చెన్నై తీరుస్తుందా?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *