Jio Hotstar App Download : జియో సినిమా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒక్కటయ్యాయి. ఈ రెండు దిగ్గజ సంస్థలు ఇకపై జియోహాట్ స్టార్ పేరుతో వినియోగదారులను అలరించనున్నాయి.

‘‘రెండు ప్రపంచాలు కలిసిన చోట ఒక అద్భుతం ఊపిరి పోసుకుంటుంది’’ అనే ట్యాగ్ తో జియో హాట్ స్టార్ వచ్చింది.
ఈ రెండు ప్లాట్ ఫామ్ లలోని కంటెంట్లను ఒకేచోట అందుబాటులోకి తెచ్చాయి. ఈమేరకు జియో హాట్ స్టార్ కు సంబంధించిన కొత్త లోగోను సైతం రిలీజ్ చేశారు.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో డిస్నీప్లస్ హాట్ స్టార్ యాప్ కొత్త లోగోతో జియో హాట్ స్టార్ గా కన్పిస్తోంది.

జియో హాట్ స్టార్ (Jio Hotstar Plans) ప్లాన్ ధరలు..
- జియో హాట్ స్టార్ మొబైల్ ప్లాన్ ప్రారంభ ధర రూ.149తో ఒక్క డివైజ్లో మాత్రమే 3 నెలలపాటు వీక్షించవచ్చు.
- ఏడాది వ్యాలిడిటీ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది.
- సూపర్ ప్లాన్ రూ .299తో మూడు నెలలపాటు రెండు డివైజ్ లలో కంటెంట్ వీక్షించవచ్చు.
- వార్షిక ప్లాన్ ధర రూ.899గా నిర్ణయించారు.
- ప్రీమియం ప్లాన్ రూ.499తో యాడ్స్ లేకుండా 4 డివైజెస్ లలో 3నెలల పాటు వీక్షించవచ్చు.
- జియో హాట్ స్టార్ వార్షిక సబ్స్క్రిప్షన్ ధరను రూ.1,499గా నిర్ణయించారు.
Bajaj E-rick : ఈ-రిక్షా విభాగంలోకి బజాజ్.. ట్రెండ్ సెట్ చేస్తుందా