Jio Hotstar Records : జియో.. డిస్నీ హాట్ స్టార్ కలయికతో జియో హాట్ స్టార్ ఏర్పడిన సంగతి తెల్సిందే. వీక్షకులకు కొత్త ప్రపంచంలో ఉన్నమనే ఫీలింగ్ కలిగిస్తామని జియో హాట్ స్టార్ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే జియో హాట్ స్టార్ సరికొత్త ఎంటైట్మైంట్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.

జియో హాట్ స్టార్లో ఉచితంగా భారత్ వర్సెస్ పాక్ మ్యాచులను అందిస్తోంది. ఆదివారం దుబాయ్ వేదికగా టీంఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది.
తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు అలౌట్ అయింది. 242 పరుగుల టార్గెట్ తో టీంఇండియా బరిలో దిగింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో అలరించాడు.
రోహిత్, గిల్, శ్రేయస్ అయ్యర్ మంచి భాగస్వామ్యాలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. 42.3 ఓవర్లలోనే భారత్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరానికి చేరుకుంది.
పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించడంతో దేశంలోని క్రికెట్ ప్రియులు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. బాణా సంచా పేల్చడంతోపాటు స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జియో హాట్ స్టార్ (Jio Hotstar )సరికొత్త రికార్డు..
భారత్ వర్సెస్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీనిని 61 మంది వీక్షించారు. కోహ్లీ విన్నింగ్ షాక్ కొట్టిన సమయంలో 62 కోట్ల మంది చూశారు. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ గా నమోదైంది.
పాక్ ఇన్నింగ్స్ సమయంలో 32 కోట్ల మంది వీక్షించారు. భారత్ ఇన్నింగ్స్ తర్వాత ఈ వ్యూయర్షిప్ అనేది రికార్డు స్థాయిలో పెరుగుతూ పోయింది.
గతంలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ డిస్నీ హాట్ స్టార్ లో 22.5 కోట్ల మంది వీక్షించారు. దీంతో పోలిస్తే నిన్నటి మ్యాచ్ మూడింతలు పెరిగింది.
ఈ లెక్కలు కేవలం జియో హాట్ స్టార్ ను వీక్షించిన వారివి మాత్రమే. దుబాయ్ స్టేడియం కెపాసిటీ 25వేలు కాగా సాధారణ ప్రేక్షకులతోపాటు సెలబ్రేటీలు భారీగా హాజరై మ్యాచ్ ను తిలకించారు.
టీవీల్లో ఎంత చూశారనేది తెలియాల్సి ఉంది. బ్రాడ్ కాస్ట్ ఆడియోన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) భారత్-పాక్ మ్యాచ్ వ్యూయర్షిప్ రిలీజ్ చేస్తే ఎంతమంది చూశారనేది స్పష్టత రానుంది.
ఏదిఏమైనా భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి కళ వచ్చినట్లయింది.
Maha Shivaratri Special Buses : శివరాత్రికి స్పెషల్ బస్ సర్వీసులు
Hyderabad to Madinah Flight : సర్వీస్ ప్రారంభించిన ఇండిగో