క్రికెట్ చరిత్రలో అధ్బుత క్యాచ్ నమోదైంది. ఈ క్యాచ్ ఫన్నీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఇలాంటి క్యాచ్ ఎవరు కూడా నమోదు చేయకపోవడం విశేషం. దీంతో ఈ ఫన్నీ క్యాచ్ కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. కేరళ ప్రీమియర్ లీగ్ లో ఈ చారిత్రక క్యాచ్ నమోదు కావడం గమనార్హం.

Kerala Premier League : భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సస్పెన్స్ థిల్లర్ ను తలపించే ఎన్నో కీలకమైన సంఘనలు క్రికెట్ మ్యాచ్ లో జరుగుతున్నాయి. కొన్నిసార్లు నరాలు తెగే ఉత్కంఠత నెలకొంటుంది. అందుకే ఈ గేమ్ ప్రపంచ స్థాయి ఆటల్లో పాపులర్ గా మారింది.
భారత్ లో క్రికెట్ లీగ్ నిర్వహించే వారికి కాసులపంట పండిస్తోంది. బీసీఐఐ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్, రంజీ, ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే క్రికెట్ లీగులు అన్ని కూడా నిర్వాహకులకు భారీ ఆదాయాన్ని తెచ్చుపెడుతున్నారు. స్పాన్సర్లు ఏమాత్రం వెనుకడకుండా క్రికెట్ మ్యాచులపై డబ్బులను ఖర్చు పెడుతున్న సంగతి తెల్సిందే.
క్రికెట్లో కొన్నిసార్లు అనుహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. అవికాస్తా క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘటనలుగా నమోదవుతున్నాయి. తాజాగా ఓ క్రికెట్ లీగ్ లో వికెట్ కీపర్ పట్టిన క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే గ్రేటేస్ట్ క్యాచ్ గా నిలిచింది. ఇలాంటి క్యాచ్ ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో నమోదు కాలేదు. ఆడమ్ గిల్ కిస్ట్, మహేంద్ర సింగ్ ధోని, సంగార్కర వంటి హేమాహేమీ వికెట్ కీపర్ సాధ్యం కానీ రీతిలో ఓ సాధారణ వికెట్ కీపర్ అద్భుతమైన క్యాచ్ పట్టి చరిత్రను సృష్టించాడు.
కేపీఏ-123 వర్సెస్ కేపీఎస్ఎ..
పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలో ప్రీమియర్ లీగ్ (Kerala Premier League) లో కేపీఏ-123 మరియు కేసీఎస్ఏ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కేసీఎస్ఏ రెండు ఓవర్ల తర్వాత నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది. మూడో ఓవర్ ను ఫిరాస్ మహ్మద్ బౌలింగ్ చేయగా తొలి బంతి బ్యాటర్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ ఏరియా వైపు వెళ్లింది.
వికెట్ కీపర్ ఆ బంతిని ఆందుకునేందుకు యత్నించాడు. అదికాస్తా కీపర్ గ్లౌవ్ కి తగిలి బౌన్స్ అయింది. గాలిలోకి లేచిన ఆ బంతి కాస్తా వికెట్ కీపర్ వీపుపై పడింది. అప్పటికప్పుడు సమయస్పూర్తిని కనబర్చిన వికెట్ కీపర్ బంతిని వీపు నుంచి కింద పడకుండా తన రెండు చేతులతో ఆపాడు. దీంతో బంతి నిశ్చలస్థితికి చేరుకోవడంతో క్యాచ్ పూర్తయినట్లు అయింది.
వికెట్ కీపర్ ఫన్నీ క్యాచ్ ను చూసిన కామెంటర్ సైతం నువ్వు ఆపులేకపోయాడు. తోటి క్రికెటర్లు సైతం వికెట్ కీపర్ పట్టిన క్యాచ్ చూసి నవ్వుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అంపైర్ బ్యాట్స్మెన్ ను అవుట్ ప్రకటించడంతో కేపీఏ 123 జట్టులో ఆనందం రెట్టింపయింది.
ఎంసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..
ఎంసీసీ నిబంధనల ప్రకారం.. ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ బంతిని అందుకున్నప్పుడు తప్పనిసరిగా బంతి వారి నియంత్రణలో ఉండాలి. ఫిల్డర్ కూడా క్యాచ్ పై పూర్తి నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే దానిని క్యాచ్ గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి.. ఈ ఫన్నీ క్యాచ్ ని చూసి మీరు కూడా కాసేపు సరదాగా నవ్వుకొండి..
Read more : IPL 2025 Mega Auction ఆ బౌలర్ కోరికను చెన్నై తీరుస్తుందా?
Google Air View Plus : మీ ప్రాంతంలోని ఎయిర్ క్వాలీటీ క్షణాల్లో
[…] Read more : Kerala Premier League వికెట్ కీపర్ ఫన్నీ క్యాచ్.. నవ… […]