Kite Festival Hyderabad 2025 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అంతర్జాతీయ పతంగుల పండుగను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. జనవరి 13 నుంచి ( Kite Festival 2025 Dates) మూడ్రోజులపాటు ఏడో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

Kite Festival Hyderabad
Kite Festival Hyderabad | Mega9.in

తెలంగాణ రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనాలని అంతర్జాతీయ, అంతరాష్ట్రాల్లో పతంగులు ఎగురవేసే కైట్‌ ఫ్లయర్స్‌ను ఆహ్వానాలను సైతం పంపించారు.

హైదరాబాద్లో నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, స్విట్జర్లాండ్‌, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్‌, థాయిలాండ్‌, , తైవాన్‌, సౌత్‌ ఆఫ్రికా, నెదర్లాండ్స్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, ఇటలీ తదితర దేశాలకు చెందిన 50మంది కైట్‌ ఫ్లయర్స్‌ హాజరుకానున్నారు.

వీరితోపాటు గుజరాత్‌, కేరళ, హర్యానా, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన 60 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

కైట్ ఫెస్టివల్ (Kite Festival Hyderabad) కు ఉచిత ప్రవేశం..

ఏడవ అంతర్జాతీయ పతంగుల వేడుకకు హాజరయ్యే వీక్షకులకు ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించనున్నారు. ఈ వేడుకలకు సుమారు 15లక్షల మంది హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

International Kite Festival
International Kite Festival | Mega9.in

సందర్శకుల సౌకర్యార్థం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. ప్రతిరోజూ (Hyderabad Kite Festival Timings) ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పిండి వంట‌లు, స్వీట్లు రెడీ

పతంగుల వేడుకతోపాటు స్వీట్ల పండుగను సైతం నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజలకు చెందిన పిండి వంటలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్లను ఈ వేడుకల్లో వీక్షకులకు పరిచయం చేయనున్నారు.

ఇందుకోసం ప్రత్యేక స్టాళ్లను సైతం ఏర్పాటు చేసినట్లు నిర్వాహాకులు వెల్లడించారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంటాయన్నారు.

ఈసారి ఇరాన్‌, తుర్కియే, అప్ఘనిస్తాన్‌తోపాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 700మంది హోమ్‌ మేకర్స్‌ ప్రదర్శనలో పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.

Read Latest National News and Latest News Updates

Cashless Treatment Scheme : వాహనదారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *