Koya Wedding Card Viral : త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ఓ కోయ జంటకు సంబంధించిన పెళ్లికార్డు నెట్టింట వైరల్ గా మారింది. మాతృభాషపై మమకారంతో ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నాన్ని ప్రతీఒక్కరు ప్రశంసిస్తున్నారు.

సాధారణంగా పెళ్లి కార్డులను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రిస్తుంటారు. వీటిని మనం తరుచూ చూస్తూనే ఉంటాం. కానీ కోయ భాషలో ముద్రించిన కార్డును మాత్రం చాలా తక్కువ మందే చూసి ఉంటారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఉండం శ్రీనివాస్ అనే కోయ యువకుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అదే జిల్లాకు చెందిన వినిత అనే కోయ యువతితో 2025 మార్చి 2న పెళ్లి ఫిక్స్ అయింది.
సోషల్ మీడియాలో కోయ వెడ్డింగ్ (Koya Wedding) కార్డు వైరల్..
ఈక్రమంలోనే ఉండం శ్రీనివాస్ మాతృభాషపై మమకారం చాటుకున్నాడు. తన పెళ్లి కార్డును కోయ భాషలో ముద్రించి బంధుమిత్రులకు పంచుతున్నారు. ఇందుకు సంబంధిన వెడ్డింగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
పెండ్లి పత్రికలో కుటుంబ సభ్యుల పేర్లు, వివాహ వేదిక, తేది, వివాహ సమయం తెలుగులో అచ్చు వేయించడం మినహా మిగిలివన్నీ కూడా కోయ భాషలోనే రాయించాడు. ఈ శుభలేఖ చూస్తుంటే అతడికి కోయ భాషపై ఎంత మక్కువ ఉందో అర్థమవుతోంది.
కోయ భాషలోని ఉన్న వెడ్డింగ్ కార్డును చూసిన నెటిజన్లు మాత్రం కోయ్.. కోయ్ అంటూనే.. కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న యువతీయువకులను ముందస్తుగా Wish You A Happy Married Life అంటూ విషెస్ చెబుతున్నారు.
Maha Shivaratri Special Buses : శివరాత్రికి స్పెషల్ బస్ సర్వీసులు
Miss World : పోటీల్లో పాల్గొనాలంటే ఉండాల్సిన అర్హతలెంటీ?