Maharashtra Elections 2024 : మహా రాష్ట్ర, ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడుతలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అదేవిధంగా ఝార్ఖండ్ రెండో విడుతలో భాగంగా 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహారాష్ట్రలో పోలింగ్ 32.18శాతం నమోదైంది. ఝార్ఖండ్ లో 47.98 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఓటుహక్కు వినియోగించుకున్న సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు..
2024లో జరుగుతున్న మహారాష్ట్ర (Maharashtra Elections) , ఝార్జండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఓటును హక్కు వినియోగించుకున్నారు. మాస్టర్ బస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సచిన్ భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం మీడియాకు ఓటువేసిన సిరా వేళ్ళను సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), అంజలి, సారాలు చూపించారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. తాను చాలా ఏళ్లుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ)కి ఐకాన్ గా ఉంటున్నానని తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇది మనందరికీ బాధ్యత అని గుర్తు చేశారు.

ప్రతిఒక్కరూ బయటికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటువేసి ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చాలని కోరారు. తమ పోలింగ్ లో బూతులో అధికారుల ఏర్పాట్లను సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. తాను ప్రస్తుతం ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయాన్ని సైతం పూర్తిగా ఆస్వాదిస్తున్నానని ఆయన వివరించారు.

అదేవిధంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, రకుల్ ప్రీతిసింగ్ దంపతులు, జెనీలియా దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫర్హాన్ అక్తర్, హేమా మాలిని తన కూతురు ఈషా దేఓల్ తో కలిసి పోలింగ్ స్టేషన్ కు వచ్చారు. రాకేష్ రోషన్, అనుపమ ఖేర్, సోనూసూద్, సునీల్ శెట్టి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా తమ బాధ్యతగా ఓటింగులో పాల్గొనాలని వారంతా పిలుపునిచ్చారు.
Read more : IPL 2025 Mega Auction
మహారాష్ట్ర, ఝార్జండ్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..
మహరాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కాగా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కోసం ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయితే వారి ఆశలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు పేర్కొన్నాయి.
- సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి..
మహారాష్ట్ర (పీపుల్స్ పల్స్) :
బీజేపీ 182 స్థానాలు
కాంగ్రెస్ 97 స్థానాలు
మహరాష్ట్ర (ఏబీపీ) :
బీజేపీ 150 నుంచి 170 స్థానాలు
కాంగ్రెస్ 110 నుంచి 130 స్థానాలు
ఇతరులు 8 నుంచి 10 స్థానాలు
ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్) :
ఎన్డీయే 46 నుంచి 58 స్థానాలు
జేఎంఎం కూటమి 24 నుంచి 37 స్థానాలు
ఇతరులు 6 నుంచి 10 స్థానాలు
చాణక్య (మహారాష్ట్ర) :
ఎన్డీఏ 152 నుంచి 160 స్థానాలు
ఇండియా కూటమి 130 నుంచి 138 స్థానాలు
చాణక్య(ఝార్ఖండ్) :
ఎన్డీఏ 45 నుంచి 50 స్థానాలు
జేఎంఎం 35 నుంచి 38 స్థానాలు
ఏబీపీ (మహారాష్ట్ర) :
ఎన్డీఏ 150 నుంచి 170 స్థానాలు
ఎంవీఏ 110 నుంచి 130 స్థానాలు
ఇతరులు 6 నుంచి 8 స్థానాలు.
కాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల అధికారిక ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.

మహారాష్ట్ర, ఝర్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అవుతున్నాయి. ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచే ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు.
ఝార్ఖండ్ మ్యాజిక్ ఫిగర్..
ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే మార్కు రావాలంటే 41 సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. 2024 ఝార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68, ఏజేఎస్ యూ 10, జేడీయూ 2, లోక్ జన్ శక్తి (రామ్ విలాస్) ఒక స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష కూటమి తరుపున జేఏంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) 4 స్థానాల్లో బరిలోకి దిగాయి.
మహారాష్ట్ర మ్యాజిక్ ఫిగర్..
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి మహాయుతిలోని బీజేపీ 149 స్థానాల్లో, శివ సేన 81 స్థానాలు, ఎన్సీపీ 59 స్థానాల్లో బరిలోకి దిగాయి. విపక్ష కూటమిలోని ఎంవీఏలోని కాంగ్రెస్ 101 స్థానాలు, శివసేన(ఉద్దవ్) 95 స్థానాలు, ఎన్సీపీ 86 స్థానాల్లో, బీఎస్పీ 23, ఎంఐఎం 17 స్థానాల్లో బరిలోకి దిగాయి.
ఉప ఎన్నికల ఫలితాలు..
దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలు సైతం నేడు వెల్లడి కానున్నాయి. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆమె భారీ ఓట్లను సాధిస్తున్నారు. గెలుపు దిశగా పయనిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ స్థానంలోనూ ఉప ఫలితాలు వెల్లడికానున్నాయి.
వయనాడ్ లో రాహుల్ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక
Wayanad Bypoll Election Results 2024 : ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ప్రియాంక గాంధీకి వయనాడ్ ఓటర్లు భారీ మెజార్టీతో ఆదరించారు. రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ లో లోక్ సభ ఉప ఎన్నిక అవార్యమైంది. మహారాష్ట్ర, ఝార్జండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని పలు ఉప ఎన్నికలను సైతం నిర్వహించింది. ఈక్రమంలోనే ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీచేసి అత్యధిక మెజార్టీని సాధించారు.
- 4లక్షల మెజార్టీ మార్క్ దిశగా వెళుతున్న ప్రియాంక గాంధీ..
Priyanka Gandhi Vadra Leads : వయనాడ్ ఉప ఎన్నికల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. అయినప్పటికీ ప్రియాంక గాంధీ నాలుగు లక్షల ఓట మెజార్టీ దిశగా వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 3లక్షల 60వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుత సమాచారం మేరకు ప్రియాంక గాంధీ 3లక్షల 64వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది. దీంతో ప్రియాంక గాంధీ 4లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తుందా? లేదా అనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.
- ప్రియాంక గాంధీ రికార్డు విజయం..
Priyanka Gandhi Won in Wayanad Kerala : వయానాడ్ లోక్ సభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను సాధించారు. గతంలో రాహుల్ గాంధీకి వయనాడ్ లో 3.60లక్షల ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి 4.39లక్షల ఓట్లు పోలయ్యాయి. వయనాడ్ ప్రజలు ఆమెకు ఏకపక్షంగా విజయం కట్టబెట్టడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
[…] Kalyan Mania Maharashtra Elections 2024 : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ […]