Mohan Babu Vs Manchu Manoj : టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి (Manchu Family) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సీనియర్ నటుడిగా మోహన్ బాబు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

మోహన్ బాబు తనయుల్లో ఒకరైన మంచు విష్ణు ‘మా’ ప్రెసెడింట్ గా ఉన్నారు. చిన్న కుమారుడు మనోజ్ బాబు హీరోగా, నటుడిగా ఉన్నారు. మోహన్ బాబు కూతురు (Mohan Babu Daughter) మంచు లక్ష్మీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది.
అయితే గత కొంతకాలంగా మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే తాజాగా మోహన్ బాబు, మనోజ్ (Mohan Babu Vs Manchu Manoj) మధ్య పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు అనుచరులు కొందరు మంచు మనోజ్ పై దాడి చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో విష్ణు, మనోజ్ (Manchu Family) మధ్య గొడవలు..
అయితే ఈ వార్తలను మాత్రం మంచు మోహన్ బాబు ఖండించారు. కాగా గతంలో మంచు విష్ణు తన తమ్ముడు మనోజ్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ గా మారాయి. నాటి నుంచే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏదిఏమైనా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు కేవలం ఆస్తి పంపకాల విషయంలో జరుగుతుందా? లేదా మరేదైనా కారణంగా ఉందా? అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై టాలీవుడ్ నుంచి ఎలాాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే..!
కాగా మోహన్ బాబు సారథ్యంలో మంచు విష్ణు హీరో ‘కన్నప్ప’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కీ రోల్ చేస్తున్నారు.
మోహన్ బాబు మనువరాళ్లు సైతం ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతోన్నారు. వీరికి సంబంధించిన పోస్టర్ ను ‘కన్నప్ప’ టీం విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Latest Entertainment News and Latest News Updates
గాయాలతో.. బంజార హిల్స్ ఆస్పత్రి వచ్చిన మంచు మనోజ్..
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కొంతకాలంగా విబేధాలు నెలకొన్నాయి. తాజాగా మోహన్ బాబు అనుచరులు ఆయన చిన్న కుమారుడు మనోజ్ కుమార్ పై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని మోహన్ బాబు ఖండించడంతో అటువంటిది ఏమి జరుగుండదని అంతా భావించారు. కానీ మనోజ్ కుమార్ నడవ లేని స్థితిలో బంజార హిల్స్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యుడితో ఆయన చికిత్స చేయించుకున్నారు.

బంజార హిల్స్ ఆస్పత్రికి మనోజ్ కుమార్ ఆయన భార్య భూమ మౌనికతో కలిసి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా మీడియా మనోజ్ కుమార్ తో మీపై దాడి జరిగిందా? అని ప్రశ్నించగా ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. అయితే మనోజ్ కుమార్ నడవ స్థితిలో ఆస్పత్రికి రావడంతో ఆయనపై నిజంగానే దాడి జరిగిందని అంతా భావిస్తున్నారు.
మోహన్ బాబు, మనోజ్ లపై కేసు నమోదు..
మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలు చివరకు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మోహన్ బాబు తన చిన్న కుమారుడు మనోజ్ కుమార్, కోడలు మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే మనోజ్ కుమార్ మోహన్ బాబుకు చెందిన పది మంది అనుచరులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పహాడిషరీఫ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Manchu Manoj Tweet :
మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకు రచ్చగా మారుతోంది. ఈనేపథ్యంలోనే మోహన్ బాబు ఇన్నిరోజులు సంపాదించుకున్న పరువు మొత్తం గంగపాలవుతుందనే కామెంట్స్ విన్పిస్తోంది. వీలైనంత త్వరగా మోహన్ బాబు, మంచు మనోజ్ లు తమ కుటుంబ తగాదాలకు పుల్ స్టాప్ పెట్టుకుంటేనే ఇరువురికి మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఏదిఏమైనా మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
Manchu Mohan Babu Tweet :
ఫ్యామిలీ గొడవలపై మంచు విష్ణు స్పందన..
మంచు విష్ణు దుబాయి నుంచి నేడు హైదరాబాద్ కు వచ్చారు. జల్‌పల్లిలోని ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో విష్ణు మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, అయితే త్వరలోనే అవన్నీ పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. ఫ్యామిలీలోని గొడవలకు పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన హితవు పలికారు.
విచక్షణ కోల్పోయి జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబు
మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం మరో మలుపు తీసుకుంది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు నేడు వెళ్లారు. అయితే గేట్ వద్దే మనోజ్ దంపతులను బౌన్సర్లు నిలిపివేశారు. అనంతరం ఆయన లొపలికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు.
ఓ మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని దాడికి పాల్పడటంతో ఇద్దరు జర్నలిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా మోహన్ బాబు చర్యలపై మీడియా జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా మోహన్ బాబు, మనోజ్ లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు పోలీసులు మంచు మోహన్‌బాబు, విష్ణు తుపాకుల లైసెన్స్‌ల సీజ్ చేసేందుకు సిఫార్సు చేశారు.
మోహన్ బాబు ఆడియో విడుదల..
Video Courtesy : BIG TV
- మోహన్ బాబుకు నోటీసులు..
మంచు మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని రాచకొండ కమిషనరేట్ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా వారి వద్ద ఉన్న గన్స్ సరెండ్ చేయాలంటూ సీపీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. జర్నలిస్టులపై దాడిని ఖండించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్. దాడిలో గాయపడిన టీవీ 9 జర్నలిస్టు రంజిత్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
రాచకొండ సీపీ ఎదుట హాజరైన మంచు మనోజ్, విష్ణు
మంచు మనోజ్ కుమార్ నేడు ఉదయం రాచకొండ సీపీ ముందు హాజరయ్యారు. తమ ఫ్యామిలిలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉంటానని లక్ష పూచీకత్తు బాండ్ ను సీపీకి సమర్పించారు.
అదేవిధంగా మంచు విష్ణు నేటి సాయంత్రం సీపీ ముందు హాజరయ్యారు. తాను సైతం మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోనని సీపీకి లక్ష బాండ్ పూచీకత్తు సీపీకి సమర్పించారు. కాగా పోలీసుల నోటీసులపై మంచు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు డిసెంబర్ 24 వరకు వ్యక్తిగత హాజరుపై మినహాయింపు లభించింది.
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్..
మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీ గొడవల్లో భాగంగా ఆయనకు రెండ్రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు బీపీ పెరగడం సహా స్వల్ప గాయాలు కావడంతో మోహన్ బాబు కంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెల్సిందే. రెండ్రోజులపాటు ఆస్పత్రిలోనే శస్త్రచికిత్స చేయించుకున్న మోహన్ బాబు నేడు డిశ్చార్జ్ అయ్యారు.
కాగా మోహన్ బాబు వర్సెస్ మనోజ్(Manchu Manoj Kumar) గొడవల్లో భాగంగా రాచకొండ కమిషనరేట్ మూడు కేసులను నమోదు చేసింది. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు వారి వ్యక్తిగతమని, అయితే జర్నలిస్టుపై ఆయన దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
మనోజ్ కుమార్ ను ఏడాది పాటు బైండోవర్ చేసినట్లు తెలిపారు. మంచు విష్ణు (Manchu Vishnu) బైండోవర్ నోటీసులపై కొంత సమయం కావాలని అడినట్లు తెలిపారు. దీంతో ఆయనకు డిసెంబర్ 24 వరకు సమయం ఇచ్చినట్లు సీపీ తెలిపారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మోహన్ బాబు మరో ఆడియో.. వైరల్
Video Credit : Sakshi TV
విష్ణుకు (Manchu Nirmala) మద్దతుగా మంచు నిర్మల..
గత కొన్నిరోజులుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య నెలకొన్న గొడవలు చివరి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లాయి. ఈక్రమంలోనే మోహన్ బాబు క్షణికావేశంలో ఓ జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనంగా మారిన సంగతి తెల్సిందే.
మంచు ఫ్యామిలీపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు సైతం ప్రకటించారు. రాచకొండ సీపీ ఇరువర్గాలను పిలిచి విచారించి పంపించారు. మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీంతో మంచు ఫ్యామిలీతో గొడవలు సర్దుమణిపోతాయని అంతా భావించారు. కానీ మరోసారి మంచు విష్ణుపై మంచు మనోజ్ ఆరోపణలు చేశారు. మంచు మనోజ్ ఇంటికి విష్ణు వచ్చి తమ ఇంట్లోని జనరేటర్లో పంచదారపోసి కరెంట్ పోయేలా చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ ఘటనపై మంచు నిర్మలా (Manchu Nirmala) తాజాగా స్పంచారు. మంచు విష్ణుకు ఆమె మద్దతుగా నిలిచారు. డిసెంబర్ 14న తన పుట్టిన రోజున తన కుమారుడు మంచు విష్ణు కేక్ తీసుకొని వచ్చాడని ఆమె తెలిపారు. తనతో కేక్ కటించి చేయించి కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయాడని తెలిపారు.
తన రెండో కుమారుడు మనోజ్ చెప్పినట్లు అలాంటిదేమీ జరుగలేదని స్పష్టం చేశారు. తన ఇంట్లో పని వాళ్లు కూడా వాళ్లంతటా వాళ్లే మానేశారని ఇందులో విష్ణు ప్రమేయం ఏమిలేదని వెల్లడించారు. దీంతో మంచు నిర్మల మద్దతు మంచు విష్ణుకే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇకనైనా మంచు ఫ్యామిలీ (Manchu Family) ఎప్పటిలాగే కలిసి ఉంటుందా? లేదా ఇలాగే ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.