Miss World 2025 Festival in Telangana : 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిధ్యం ఇవ్వబోతుంది. ప్రపంచ సుందరి పోటీలు గతంలో ముంబై, ఢిల్లీ నగరాల్లో అట్టహాసంగా జరిగాయి. ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ను వేదికగా మారనుంది.

యావత్ ప్రపంచం ప్రపంచ అందాల పోటీల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరుగనుండటంతో ఇక్కడి చారిత్రక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటేందుకు గొప్ప అవకాశం కానుంది.
ఈ వేడుకలకు సంబంధించిన అధికారిక ప్రకటనను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ విడుదల చేశారు. ‘తెలంగాణ ‘జరూర్ ఆనా’ నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానిస్తోందని తెలిపారు.
అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు.. గొప్ప చేనేత వారసత్వం.. అరుదైన వంటకాలు.. విభిన్నమైన కళా వారసత్వం కలిగిన తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ వెల్లడించారు.

72వ మిస్ వరల్డ్ పోటీలకు (Miss World 2025) వేదికగా హైదరాబాద్
మిస్ వరల్డ్ పోటీలు దాదాపు నాలుగు వారాలపాటు జరుగనున్నాయి. ప్రారంభ.. ముగింపు వేడుకలతోపాటు గ్రాండ్ ఫినాలే పోటీలు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొనన్నారు.
‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ అనే లక్ష్యంతో జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీల్లో పాల్గొనే దేశవిదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలుకనుంది.
మే7న అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉండనుంది.గతంలో మిస్ వరల్డ్ పోటీలు న్యూఢిల్లీ.. ముంబైలో జరిగాయి. 71వ ఎడిషన్ ముంబైలోనే జరిగింది.
అయితే ఈ ఏడాది జరిగే మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికగా మారడం తెలంగాణకు గర్వకరణంగా మారింది.
EV Charging Stations : తెలంగాణలో భారీగా ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు
E FLYING BOAT : ఈ ప్లయింగ్ బోట్ ఆవిష్కరణ
Jio Hotstar : రెండు ప్రపంచాల కలయిక ‘జియో హాట్ స్టార్’