MLC Nominations in Telangana : రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. అప్పటి నుంచే కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్స్, నల్లగొండ టీచర్స్ నియోజక వర్గాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ.. 11న నామినేషన్లను పరిశీలన.. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
ఫిబ్రవరి 27 పోలింగ్ (MLC Nominations).. మార్చిన 3న ఫలితాలు..
ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్లను లెక్కించనున్నారు. ఈ మేరకు నామినేషన్లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాలకు కరీంనగర్లో, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి నల్లగొండలో నామినేషన్లు స్వీకరించనున్నారు.
దీంతో కలెక్టరేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి.
బరిలో ఉండాలనుకుంటున్న వారంతా ప్రచారాన్ని షూరు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కావడంతో తెలంగాణలో జిల్లాలో ఎన్నికల హడావుడి నెలకొంది.
Union Budget 2025-26 : భారత బడ్జెట్ 2025 హైలెట్స్