Mohan Babu Grandchildrens in Kannappa : మంచు మోహన్ బాబు ‘కన్నప్ప’ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్ తో ‘కన్నప్ప’ను నిర్మిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తోపాటు బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ భాగస్వామ్యం అవుతున్నారు.

‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తుండటంతో ఈ మూవీకి భారీ హైప్ నెలకొంది. దీంతో కన్నప్ప భారం మొత్తం ప్రభాస్ పైనే ఉందనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ముఖేష్ రిషి తదితరులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి.
తాజాగా మరో ఇద్దరిని పరిచయం ‘కన్నప్ప’ టీం పరిచయం చేసింది. మోహన్ బాబు (Mohan Babu Grand Childrens) మనవరాళ్ళు అరియానా, వివియానా పుట్టిన రోజును పురస్కరించుకొని వీరికి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘ఆడినా.. పాడినా.. అంతా శివయ్య కోసమే’ అంటూ చిత్రయూనిట్ మోహన్ బాబు మనవరాళ్ళను పరిచయం చేసింది.

తన మనవరాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంపై మోహన్ బాబు ట్వీట్ చేశారు. ‘‘కన్నప్పతో నా మనవరాల్లు అరియానా, వివియానా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నాను.. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది.. పరిశ్రమలో వారికి గుర్తింపురావాలని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా..’’ అంటూ మోహన్ బాబు తెలియజేశారు.
అలాగే తన ఇద్దరు కూతుళ్ళు సినిమాల్లోకి రావడంపై మంచు విష్ణు సైతం స్పందించాడు. ‘‘కన్నప్పలో అరియానా, వివియానాతో నేను నటనను పంచుకున్నప్పుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది.. నా చిన్న మమ్మీల తెరపై మాయజాలం సృష్టించారు.. హ్యాపీ బర్త్‌డే అరి వివి. ఐ లవ్ యూ అంటూ’’ మంచు విష్ణు ట్వీట్ చేశాడు.
కన్నప్ప చిత్రాన్ని మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ‘కన్నప్ప’ మూవీని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. చాలా రోజులుగా మంచు ఫ్యామిలీ సరైన హిట్టు కోసం వేయికళ్ళతో వేచి చూస్తోంది. వారి ఆశలను ‘కన్నప్ప’ ఏ మేరకు నిలబెడుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే..!
Read Latest Entertainment News and Latest News Updates