Bank Strike 2025 : బ్యాంకింగ్ రంగంలోని యూనియన్లు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి ఐదు రోజుల పని, అన్ని కేడర్లలో తగినట్లు రిక్రూట్ మెంట్ చేయాలని, వివిధ డిమాండ్లతో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగనున్నాయి.

మార్చి 24 నుంచి రెండ్రోజులపాటు బ్యాంక్ సమ్మె నిర్వహించనున్నారు. ఈమేరకు 9 బ్యాంకుల ఉద్యోగుల సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) వెల్లడించింది.
మార్చి 24, 25 తేదిల్లో (Bank Strike 2025) బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్ మెన్/ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి సైతం యూఎఫ్ బీయూ డిమాండ్ చేస్తుంది. తగిన చర్చలు జరిపిన తర్వాత మార్చి 24, 25 తేదీల్లో సమ్మె నిర్వహించాలని నిర్ణయించినట్టు యూఎఫ్బీయూ అధికారికంగా వెల్లడించింది.
ఉద్యోగుల మధ్య విభజనను సృష్టించేలా పనితీరుపై సమీక్ష జరపడం, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని యూఎఫ్బీయూ స్పష్టం చేసింది.
BARCLAYS BANK : బ్యాంక్ టెక్నికల్ ప్రాబ్లం.. లక్షల ఫౌండ్లు ఖాళీ