Anaganaga Oka Raju Teaser : రాజుగారి పెళ్లంటే సౌండ్ ఏ రేంజ్ లో ఉండాలి.. అంటూ హీరో నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజున ‘అనగనగా ఒక రాజు’ టీం సర్ ప్రైజ్ వీడియో విడుదల చేసింది.

Anaganaga Oka Raju
Anaganaga Oka Raju | Mega9.in

జాతిరత్నం ఫేమ్ నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజును పురస్కరించుకొని ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీం అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

‘‘మా నవీన్ పొలిశెట్టికి జన్మదిన శుభాకాంక్షలు.. రాజుగారి పెళ్లంటే సౌండ్ యే రేంజులో ఉండాలి..’’ అనే క్యాషన్ తో ‘అనగనగా ఒక రాజు’ టీజర్ ను విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి తరహా కామెడీ.. మీనాక్షి చౌదరి మెస్మరైజ్ చూపులతో కూడిన వెడ్డింగ్ షూట్ నెట్టింట వైరల్ గా మారింది.

Anaganaga OkaRaju -Meenakshi Chaudhary
Anaganaga OkaRaju -Meenakshi Chaudhary

అనగనగగా ఒక రాజు టీజర్ ప్రారంభంలో.. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారం పల్లెంలో భోజనం వడ్డిస్తారు. అక్కడికి కామెడియన్ చంద్ర వచ్చి తన తరహా కామెడీతో అలరిస్తాడు. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టికి అపరకుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకను టీవీలో చూస్తుంటాడు.

అప్పుడే ముఖేష్ అంబానీ నవీన్ పొలిశెట్టికి ఫోన్ చేస్తాడు. ముఖేష్ మామయ్య.. నీకు వంద రీచార్జులు అంటూ నవీన్ పొలిశెట్టి అంబానీతో మాట కలుపుతాడు. మన అనంత్ అంబానీ పెళ్లి వేడుకను చూస్తున్నా అంటూ సంభాషణ మొదలుపెడుతాడు. అతడి ఒక్కో మాట.. నవీన్ కామెడీ టైమింగ్ కు అద్దంపడుతుంది.

Anaganaga Oka Raju Teaser
Anaganaga Oka Raju Teaser | Mega9.in

ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి.. హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రీ వెడ్డింగ్ షూట్ చూపించారు. వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ షూట్ అభిమానులను ఆకట్టుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో అద్భుతమైన కామెడీని అభిమానులకు పంచారు.

ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నారు. నాగ వంశీ మరియు సాయి సౌజన్యలు సంయుక్తంగా సితార ఎంటటైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో మూవీని నిర్మిస్తున్నారు. శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తోంది.

Anaganaga Oka Raju - Naveen Polishetty
Naveen Polishetty HBd

మిక్కీజే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘అనగనగా ఒక రాజు’మూవీని 2025లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ టీజర్లో చూపించింది.

Anaganaga Oka Raju Teaser Pre Wedding Video :

Read Latest Entertainment News and Latest News Updates

జాతిరత్నం మూవీతో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నవీన్ పొలిశెట్టి హీరోగా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ మూవీ 2023లో విడుదలైంది. ఈ సినిమా యావరేవ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా వచ్చి రెండేళ్లు కావొస్తున్న నవీన్ పొలిశెట్టి సినిమా థియేటర్లలో కన్పించలేదు. అయితే ఆ మధ్య నవీన్ శెట్టికి చిన్న యాక్సిండెంట్ అయింది. దీంతో అతడు నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ మూవీ షూటింగ్ ఆలస్యమైంది. అయితే ఈ మూవీని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.

నేడు నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజు (Naveen Polishetty Birthday)ను పురస్కరించుకొని ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. 2025లో ‘అనగనగా ఒక రాజు’ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *