Champions Trophy 2025 Pakistan VS Newzeland : క్రికెట్ ప్రియులను ఊరిస్తూ వస్తున్న చాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. పాకిస్థాన్ ఈ మెగా టోర్నికి అతిథ్యం ఇస్తోంది.

ఫిబ్రవరి 19న బుధవారం కరాచీ వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ న్యూజిలాండ్ జట్టును బ్యాటింగుకు ఆహ్వానించింది.
కివీస్ విల్ యంగ్, లాథమ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది.
టార్గెట్ ను చేధించేందుకు బరిలో దిగిన పాకిస్థాన్ లక్ష్య చేధనలో తడబడింది. బాబర్ అజామ్ (64).. సల్మాన్ (42).. కుషాల్ షా (69) పోరాడినా ఫలితం దక్కలేదు.
న్యూజిలాండ్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో విక్టరీని సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫి-2025 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించి మిగతా జట్లకు ఛాలెంజ్ ను విసిరింది.
Champions Trophy 2025 న్యూజిలాండ్ బ్యాంటింగ్..
న్యూజిలాండ్ ఓపెనర్లు విల్ యంగ్, డేవన్ కాన్ఫేలు తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ ఆరంభించారు. అయితే ఒకే ఓవర్ వ్యవధిలో ఓపెనర్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1) వికెట్లను కోల్పోవడంతో కివీస్ జట్టుకు షాక్ తగిలింది. డేరిల్ మిచెల్ (10) సైతం నిరాశపర్చాడు.

ఆ తర్వాత ఓపెనర్ విల్ యంగ్, లాథమ్ కలిసి పాక్ బౌలర్లను బెంబేలెత్తించారు. ఇద్దరూ క్రీజ్లో కుదురుకున్న భారీ షాట్లతో అలరించార. విల్ యంగ్, లాథమ్ సెంచరీలు చేశారు.
విల్ యంగ్ (107) అవుటైన తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ దూకుడుగా ఆడాడు. బౌండరీలు సిక్సులను బాదాడు. కేవలం 39బంతుల్లోనే 61పరుగులు చేశాడు.
మరో ఎండ్లో లాథమ్ కూడా దూకుడుగా ఆడి సెంచరీ చేశాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి 118 పరుగులు చేశాడు. దీంతో న్యూజీలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 320పరుగులు సాధించింది.
నీషమ్ షా, హరీశ్ రవూఫ్ చెరి రెండు వికెట్లు, అబ్రార్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది.
పాకిస్థాన్ లక్ష్య చేధన..
321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ తొలి నుంచే తడబడింది. ఓపెనర్ సౌద్ షకీల్ (6) పరుగులు, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (3) నిరాశపరిచారు.
బాబర్ అజామ్, ఫకర్ జమాన్ కలిసి పాకిస్తాన్ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ చాలా నెమ్మదిగా పరుగులు చేయడంతో కావాల్సిన రన్ రేట్ భారీగా పెరిగి పోయింది.
ఈ క్రమంలోనే ఫకర్ జమాన్ (24) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన సల్మాన్ అఘా బ్యాటింగ్ లో చెలరేగిపోయాడు. 28 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు.
ఆ తర్వాత వచ్చిన తయ్యబ్ తాహిర్ (1) బ్యాటింగులో విఫలమయ్యాడు. చాలా స్లో రన్ రేట్ తో పరుగులు చేసిన బాబర్ అజామ్ వేగంగా పరుగులు చేయాలనే ప్రయత్నంలో పెవిలియన్ బాటపట్టాడు.
బాబర్ అజామ్ 90 బంతుల్లో 64 పరుగులే చేశాడు. చివర్లో ఖుషిల్ షా (69) దూకుడుగా ఆడినా బంతులు తక్కువగా ఉండటంతో భారీగా ఒత్తిడి పెరిగింది.
టెయిలెండర్లు షాహీన్ అఫ్రీది (14), నీషమ్ (13), హరీశ్ రవూఫ్ (19) దూకుడుగా ఆడే ప్రయత్నంలో త్వరగా అవుటయ్యారు.
దీంతో పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. న్యూజీలాండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విలియయ్ ఓరూర్కే, మిచెల్ శాంట్నర్ చెరో మూడు వికెట్లు, మాట్ హెన్రీ రెండు, మైఖెల్ బ్రేస్వెల్, నాథన్ స్మిత్లు తలా ఒక వికెట్ తీశారు. లాథమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
WPL 2025 Gujarat : బోణి కొట్టిన గుజరాత్
RBIDATA APP : ఆర్బీఐ డేటా యాప్ ప్రారంభం