Pet Expo Hyderabad Timings and Dates : జంతు, పక్షి ప్రేమికులను అలరించేలా పెటెక్స్ ఇండియా 7వ ఎడిషన్ షో జరుగనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పెటెక్స్ నిర్వాహకులు తెలియజేశారు.

పెట్ ఎక్స్ పోతోపాటు కిడ్స్ ఫెయిర్, తొలి కిడ్స్ బిజినెస్ కార్నివాల్, ఇండియా బేక్ షో, కిడ్స్ మారథాన్ వంటి కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు. పెటెక్స్ అనేది కేవలం పెంపుడు జంతువులకు సంబంధించిన ప్రదర్శన మాత్రమే కాదని నిర్వాహకులు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద పెట్ ఎక్స్ పో (Pet Expo Hyderabad)..
ఇందులో పాల్గొనడం ద్వారా జంతువులకు సంబంధించిన అన్ని విషయాలను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. పెటెక్స్ పెట్ ఫుడ్, పెట్ హెల్త్ కేర్, పెట్ ఫ్యాషన్.. లైఫ్ స్టైల్స్, పెట్ యాక్సెసరీస్, పెట్ టాయ్స్, పేట్ బోర్డింగ్ వంటి 60మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారని తెలిపారు.
పెంపుడు జంతువుల పరిశ్రమ, తయారీదారులు, వ్యాపారులు, సేవా ప్రదాతలకు పెంపుడు జంతువుల ఉత్పత్తులను, పరిశ్రమ నిపుణులు, వ్యాపార సందర్శకులకు వినూత్న పెంపుడు జంతువులు సరఫరాలను అందించడానికి ఇది చక్కని వేదికగా నిలువనుందని పేర్కొన్నారు.
ఈ షోలొ పాల్గొనేందుకు ప్రవేశం రుసుము ముందుగా బుక్ చేసుకుంటే రూ.399.. అదేరోజు బుక్ చేసుకుంటే రూ. 449గా నిర్ణయించారు. పెటెక్స్ షోతోపాటు హైటెక్స్ హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్లో సైతం ప్రవేశానికి ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
Read more : పెట్ పార్క్.. రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు భలే డిమాండ్