President Draupadi Murmu – Lokmanthan 2024 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఆ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. హైదరాబాద్లోని శిల్పారామం వేదికగా లోకమంథన్-2024 (Lokmanthan 2024 ) కార్యక్రమం జరుగనుంది. ఈ వేడుకలో భాగంగా నవంబర్ 22న దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనన్నారు.

ఈ సదస్సులో జరిగే మేథోమథన కార్యక్రమాన్ని భారత రాష్ట్రతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. లోకమంథన్ (Lokmanthan 2024) కార్యక్రమం నవంబర్ 21 నుంచి 24 వరకు కొనసాగనుంది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో రెండ్రోజులు పర్యటించనున్నారు. నవంబర్ 21న సాయంత్రం 6గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ద్రౌపతి ముర్ము రానున్నారు.
అనంతరం సాయంత్రం 6.20గంటల నుంచి రాత్రి 7.10 గంటల వరకు తెలంగాణ రాజ్ భవన్లో ఉండనున్నారు. నవంబర్ 22న మధ్యాహ్నం 12.05 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది.
Read more : Telangana Samagra Kutumba Survey కనెక్ట్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. నేటి సాయంత్రం రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాజ్ భవన్ లో బస చేస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు.
శుక్రవారం రోజున గిరిజన జాతర లోక్ మంథన్ మహోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇలాంటి మహోత్సవం తొలిసారి హైదరాబాద్ లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు.
హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నేటి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9గంటల వరకు బేగంపేట ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్ అవుట్‌గేట్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్, ఎయిర్‌పోర్టు వై జంక్షన్, మోనప్ప జంక్షన్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
అలాగే యశోద హాస్పిటల్, కత్రియా హోటల్, రాజ్‌భవన్‌రోడ్డు, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లైవోవర్, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్, తెలుగుతల్లి వంతెన, కట్టమైసమ్మ ఆలయం, ఇక్బాల్ మినార్, పాత అంబేద్కర్ విగ్రహం జంక్షన్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్ కూడళ్ళలో ట్రాఫిక్ మళ్లింపు చేయనునున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు.
[…] […]