Pushpa-2 Advance Bookings : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప-2 రాబోతుంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఓవర్సీస్ లో డిసెంబర్ 4నే పుష్ప-2 థియేటర్లలో సందడి చేయనుంది. విడుదలకు ఇంకా 21 రోజుల సమయం ఉండగానే అభిమానుల్లో పుష్ప ఫీవర్ మొదలైంది.

బాక్సాఫీస్ వద్ద అప్పుడే పుష్ప రూలింగ్ స్టార్ అయింది. ఈ మూవీకి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా పుష్ప-2 ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది. అత్యంత వేగంగా 7లక్షల 50వేల అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ (Pushpa-2 Advance Bookings), టికెట్ల పరంగా 27వేల బుకింగ్స్ ను రాబట్టింది. ఒక తెలుగు సినిమాకు ఓవర్సీస్ లో ఇది ఒక రికార్డుగా నిలిచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ ఉందో అర్థమవుతోంది.

ఇకపోతే పుష్ప-2కు సంబంధించిన పోస్టర్స్.. టీజర్.. ట్రైలర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ మూవీలో రెండు పాటలు ఇప్పటికే విడుదలై అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ లో కుర్ర హీరోయిన్ శ్రీలీల కన్పించనుంది. తనదైన మెగా డాన్స్ స్టెప్పులతో శ్రీలీల అలరించే అవకాశముంది.

పుష్ప-2 ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ త్వరలోనే పట్నా వెళ్లనుంది. ఈనెల 17న సాయంత్రం 5గంటలకు పట్నాలోని గాంధీ మైదాన్ లో పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ను నిర్వహించనున్నారు. దీంతో అభిమానులు సైతం పుష్ప-2 ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న పుష్ప రాజ్.. విడుదల తర్వాత ఎలాంటి కలెక్షన్లు రాబడుతాడనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
Read more : IPL 2025 Mega Auction : ఆ బౌలర్ కోరికను చెన్నై తీరుస్తుందా?
Allu Arjun Pushpa 2 The Rule Trailer in Telugu | Rashmika Mandanna Pushpa 2
పుష్ప ది రూల్ డిసెంబర్ 5న (Pushpa The Rule Release Date) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈక్రమంలోనే చిత్రయూనిట్ పుష్ప 2 ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది. ఇటీవల పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ కు సంబంధించి గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా కేరళలో పుష్ప ది రూల్ కు సంబంధించి గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ కార్యక్రమాన్ని వీక్షించండి.
Pushpa Rules Keralam Grand Event In Kochi LIVE | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | Sukumar
‘పుష్ప 2’ టికెట్స్ ధరలు (Pushpa 2 Ticket Price )..
పుష్ప ది రూల్ టికెట్ (Pushpa 2 Ticket Price) ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెనిఫిట్ షోలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టిపెక్స్ లో టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
- డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు, అర్థరాత్రి 1 గంటలకు పుష్ప2 బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు సైతం అనుమతి లభించింది. వీటి టికెట్ ధర రూ.800లు అదనంగా పెంచుకునేందుకు అవకాశముంది.
- డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 టికెట్ ధరను అదనంగా నిర్ణయించారు.
- డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్ లో రూ.150 టికెట్ ధరకు అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.20, మల్టీప్లెక్స్ లో రూ.50 అదనంగా పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లుగా ఉందని సమాచారం. ఆరు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 12వేలకు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు.
PEELINGS Telugu Lyrical Video Pushpa 2 The Rule
Read more : ఏం చేస్తాం.. నన్ను ఎవరూ పిలువడం లేదు
Zainab Ravdjee : అయ్యగారికి.. కలల రాణి దొరికిందోచ్..!
Pet Parks : పెట్ పార్క్.. రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు భలే డిమాండ్
Pushpa 2 Collections పుష్ప-2 ఫస్ట్ డే కలెక్షన్స్..
అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై హిట్ టాక్ తో భారీ కలెక్షన్లను రాబడుతోంది. పుష్ప-2 ఫస్ట్ డే కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూలు చేసిందని మైత్రి మైవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇండియా సినిమా చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించింది.
పుష్ప ప్రభంజనం.. మూడురోజుల్లో 500 కోట్లు
Pushpa 2 New Records : పుష్ప 2 ది రూల్ మూవీ విడుదలైన మూడురోజుల్లోనే 500కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప-2’ సక్సస్ మీట్ లో వెల్లడించారు. అయితే టికెట్ బుకింగ్స్ (Pushpa 2 Tickets ) విషయంలోనూ పుష్ప-2 సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
బుక్ మై షో (Book My Show) లో పుష్ప-2 సినిమాకు ప్రతి గంటకు 10లక్షలకు పైగా బుకింగ్స్ (Pushpa 2 Bookings) అవుతున్న తొలి సినిమాగా నిలిచింది. 2024 సంవత్సరంలో బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుక్ అయిన టాప్ 10 సినిమాల జాబితాను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.
- మొదటి స్థానంలో రెబల్ స్టార్ కల్కి- 13.14 మిలియన్స్
- శ్రద్ధ కపూర్ స్త్రీ 2 – 11.40 మిలియన్
- పుష్ప2 – 8.17M (కేవలం 3 రోజులు)
- శివకార్తికేయన్ అమరన్ – 4.89 మిలియన్
- ఎన్టీఆర్ దేవర – 4.80మిలియన్
- హనుమాన్ – 4.72 మిలియన్
- భూల్భూలయ్యా3 -4.67మిలియన్
- విజయ్ గోట్ – 4.51 మిలియన్
- మంజుమ్మెల్ బాయ్స్ – 4.30 మిలియన్
- అజయ్ దేవగన్ సింగం ఎగైన్ – 3.77 మిలియన్స్ బుకింగ్స్ అందుకున్నాయి.
పుష్ప-2 జోరు చూస్తుంటే.. పుష్ప లాంగ్ రన్ లో కల్కి రికార్డును బద్దలు కొట్టే అవకాశముందనే ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.
Pushpa OTT డీల్ రూ.275 కోట్లు..
పుష్ప 2 మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీపడ్డాయి. ఈ సినిమాను దక్కించుకునేందుకు అమెజాన్ ప్రైమ్ చివరివరకు పోటీపడినా.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఫిల్మ్ వర్గాల సమాచారం మేరకు పుష్ప 2- ఓటిటీ హక్కులను నెట్ ఫిక్స్ రూ.275 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో పుష్ప-1 ఓటీటీ హక్కులను అమెజాన్ కేవలం రూ. 30కోట్లకు దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ ఓటిటీ రైట్స్ ను రికార్డ్ స్థాయిలో రూ. 175 కోట్లకు దక్కించుకుంది.
పుష్ప ది రూలర్ ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 500కోట్లను రాబట్టింది. హిట్ టాక్ తో భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలో రావాలంటే మాత్రం నెల నుంచి రెండునెలలు పట్టే అవకాశం కన్పిస్తోంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్ ఫిక్స్ ప్రకటించే అవకాశముంది.
Pushpa 2 OTT స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ (పుష్ప-2) బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. ఫాస్టెస్ట్ 1000 కోట్లు సంపాదించుకున్న చిత్రంగా రికార్డు నెలకొల్పింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా పుష్ప-2 మంచి కలెక్షన్లను రాబడుతోంది.
పుష్ప-2 ఓటీటీ (Pushpa 2 OTT) స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫిక్స్ సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే ఈసినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 2025 జనవరి 9న పుష్ప-2 మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫిక్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పుష్ప-2ను స్ట్రీమింగ్ చేస్తే ఎక్కువ ఓటీటీ వ్యూయర్ షిప్ వస్తోందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరీ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందో వేచి చూడాల్సిందే..!
పుష్ప 2 హిందీ (Pushpa 2 Hindi) రికార్డ్స్..
పుష్ప 2 మూవీ రిలీజై రెండు వారాలైనప్పటికీ థియేటర్లలో మాత్రం కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంలేదు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 జోరుగా కొనసాగుతోంది. ప్రధానంగా హిందీ మార్కెట్ పుష్పకు బాగా కలిసొచ్చినట్లు కన్పిస్తోంది.
హిందీలో పుష్ప-2 (Pushpa 2 Hindi Records ) కేవలం 12రోజుల్లోనే ఆల్ రికార్డుకు చేరువైంది. సోమవారం (డిసెంబర్ 16) నాటికి పుష్ప-2 హిందీలో సుమారు 582 కోట్ల నెట్ వసూళ్ళను రాబట్టింది. మంగళవారం(డిసెంబర్ 17) నాటికి 601.50 కోట్ల నెట్ వసూళ్ళను రాబట్టిందని తెలుస్తోంది.
దీంతో హిందీలో పుష్ప-2 అతిపెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఇప్పటిదాకా షారుక్ ఖాన్ ‘జవాన్’ కలెక్షన్లు 584 కోట్లు ఉంది. ఆ రికార్డును పుష్ప 2 దాటేసింది. హిందీలో ప్రస్తుతం స్త్రీ-2 627 కోట్లు సాధించి అత్యంత లాభదాయకమైన చిత్రంగా ఉంది.
పుష్ప-2 హిందీలో మంగళవారం నాడు 19.50కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దీంతో ఈ మూవీ లాంగ్ రన్ లో స్త్రీ-2ను సైతం దాటేసి హిందీలో ఆల్ టైమ్ రికార్డును సెట్ చేసే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. ఏదిఏమైనా నార్త్ ఇండియన్స్ పుష్ప-2కు బ్రహ్మరథం పడుతున్నారని కలెక్షన్లు చూస్తుంటే అర్థమవుతోంది.
[…] Read more : అడ్వాన్స్ బుకింగ్స్ లో పుష్ప-2 ఆల్ టైం… […]
[…] Read more : Pushpa-2 Advance Bookings పుష్ప-2 ఆల్ టైం రికార్డు […]
[…] Read more : Pushpa-2 Advance Bookings పుష్ప-2 ఆల్ టైం రికార్డు […]
[…] Read more : Pushpa-2 Advance Bookings పుష్ప-2 ఆల్ టైం రికార్డు […]
[…] Read more : Pushpa-2 Advance Bookings […]