Ramcharan Ayyappa Deeksha : మెగా పవర్ స్టార్ రాంచరణ్ అయ్యప్ప దీక్ష తీసుకున్న సంగతి తెల్సిందే. ప్రతియేటా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకుంటారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప మాలాధరణ చేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆయన అయ్యప్ప దీక్షను కొనసాగిస్తున్నారు.

Ramcharan Ayyappa Deeksha | Mega9.in
Ramcharan Ayyappa Deeksha | Mega9.in

రాంచరణ్ డిసెంబర్ 21న అమెరికాకు వెళుతున్నారు. గేమ్ ఛేంజర్ (Game Changer Pre Release Event) ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ సభ్యులు అమెరికా వెళుతున్నారు.

డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు, ఎస్జే సూర్య తదితరులతో కలిసి రాంచరణ్ సైతం అమెరికా వెళుతున్నారు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప దీక్షలో ఉండగా మాలధరణ విరమణ సమయానికి రాంచరణ్ అమెరికాలో ఉండనున్నారు.

అయ్యప్ప మాల విరమణ ఎక్కడ చేయబోతున్నారు

దీంతో ఆయన అమెరికాలోని డల్లాస్ లోనే (Dallas Ayyappa Temple) అయ్యప్ప మాల విసర్జన చేయనున్నారు. డల్లాస్ లోని ఓ అయ్యప్ప స్వామి దేవాలయంలో రాంచరణ్ మాల విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాంచరణ్ రెగ్యూలర్ అవుట్ ఫిట్ లోనే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

రాంచరణ్ గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) ఇప్పటికే మొదలయ్యారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Read Latest Entertainment News and Latest News Updates

Ramcharan in USA.. Memorable Night in USA

Ram Charan Game Changer Trailer (Telugu) :

Game Changer Trailer (Telugu) | Ram Charan | Kiara Advani | Shankar | Thaman S | Dil Raju | Shirish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *