Rashmika Mandanna The Girlfriend Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ‘పుష్ప-2’ భారీ సక్సస్ అందుకున్న రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

రష్మిక మందన్నకు ‘లవ్ స్టోరీ’ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చాయి. అయితే ‘డియర్ కామ్రేడ్’ మూవీ తర్వాత రష్మిక ప్రేమకథ చేయలేదు. మళ్లీ అటువంటి ఎమోషన్ చూపించే అవకాశం ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీతో రష్మికకు వచ్చింది.
ది గర్ల్ ఫ్రెండ్ (THE GIRLFRIEND Movie ) టీజర్..
తాజాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ విడుదలైంది. ఒక నిమిషం 35 సెకన్ల నిడివితో టీజర్ విడుదలైంది. ఇందులో రష్మిక మందన్న చూట్టూనే కథ తిరుగుతుందని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో..

‘‘నయనం నయనం కలిసే తరుణం.. యదనం పరుగే పయనం పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇకమీదట నువ్వే దానికి గమ్యం.. విసిరిన నవ్వుల వెలుగుని చూసా.. నవ్వాపితే పగలే చీకటి తెలుసా.. నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా..’’ వర్ణనతో టీజర్ మొదలైంది.
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ (The Girlfriend Movie Teaser) టీజర్ లో కథ గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ ఓ విలక్షణమైన అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న వైవిధ్యమైన లవ్ స్టొరీ అనే ఫీల్ ను కలిగించింది. హీరో దీక్షిత్ శెట్టికి స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా కన్పించింది. బీజీఎంగా వినిపించిన పాట అర్ధవంతంగా విన్పించింది.
చివర్లో రష్మిక ‘‘ఇదేదో పికప్ లైన్ అయితే కాదు కదా.. అస్సలు పడను..’’ అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నిర్మాతలుగా ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.
Rashmika Mandana The Girl Friend Teaser :
Read Entertainment News and Latest News Updates