RBIDATA APP : భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆర్థిక గణాంకాల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక డేటాను సులభంగా తెలుసుకునేలా ‘ఆర్బీఐ డేటా’ యాప్ ను తాజాగా ఆవిష్కరించింది.

RBI Launches New App
RBI Launches APP Launches RBI | Mega9.in

ఆర్బీఐ డేటా యాప్ ద్వారా 11 వేల రకాల ఆర్థిక డేటాను అందుబాటులోకి తెచ్చింది. ఇంటరాక్టివ్ గ్రాఫ్ లు, చార్ట్ ల ద్వారా ఈ డేటాను అర్థం చేసుకునేలా ఈ యాప్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

బ్యాంకింగ్ రంగంలోని సేవల గురించి తెలుసుకోవాలని అనుకునే వారికోసం ప్రత్యేకంగా ‘బ్యాంకింగ్ ఔట్ లెట్’ విభాగం సైతం ఈ యాప్ లో అందుబాటులో ఉంచారు.

అన్నిరకాల బ్యాంకింగ్ (RBIDATA APP) సేవలు అందుబాటులోకి

ఈ యాప్ ద్వారా కస్టమర్లు తాము ఉన్న ప్రాంతం నుంచి 20 కి.మీల పరిధిలోని బ్యాంకింగ్ సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని బ్యాంకు సేవలను కనుగొనేందుకు సులభమైన అవకాశం లభించనుంది.

ఇందులో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక డేటాకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను తెలుసుకునే వారికి ఈ యాప్ ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Jio Hotstar : రెండు ప్రపంచాల కలయిక ‘జియో హాట్ స్టార్’

EV Charging Stations : తెలంగాణలో భారీగా ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ayesha Serial Actress : అందమా.. అయస్కాంతమా.. Sahar Krishnan : అప్సరకు తీసిపోని అందం.. Actress Vaishali Raj : వైశాలి రాజ్ క్యూట్ పిక్స్ వైరల్..