Electricity Consumption in Telangana : తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు అయింది. ఫిబ్రవరి 6న 15వేల 752 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు.

గతంలో 2024 మార్చి 8న 15వేల623 మెగావాట్లు అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదైంది. ఈసారి ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్ చేరడంతో సమ్మర్లో విద్యుత్ వినియోగం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
వేసవిని దృష్టిలో (Electricity Consumption) ఉంచుకోని ప్రణాళికలు..
సమ్మర్ లో విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని 17వేల 000 మెగావాట్ల కంటే ఎక్కువ డిమాండ్ తట్టుకునేలా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గడిచిన 13నెలల వ్యవధిలో వెయ్యి కోట్ల ఆదా జరిగినట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు.
ఏదిఏమైనా సమ్మర్ ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతుండటం గమనార్హం.
Gongadi Trisha : గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా
11న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భేటి
తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగి పోతుంది. తాజాగా 16 వేల మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వేసవి, యాసంగి పంటల దృష్ట్యా డిమాండ్ పెరుగుతోంది. గతేడాది మార్చిలో అత్యధిక డిమాండ్లు నమోదైతే.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక డిమాండ్లు నమోదు అవుతున్నాయి.
2024 మార్చిలో రికార్డు స్థాయిలో 15,623 మెగావాట్లు నమోదైంది. ఏడాది ఫిబ్రవరి 7న అత్యధికంగా 15,920 మెగావాట్లకు పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత పెరుగనుంది.
ఈ నేపథ్యంలో రేపు విద్యుత్ సంస్థల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. డిమాండ్ కు తగ్గట్లు విద్యుత్ పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రెప్పపాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా : డిప్యూటీ సీఎం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా (Energy Review Meeting) ప్రణాళికలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
రానున్న వేసవిలో డిమాండ్ మేర విద్యుత్ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రెప్పపాటు అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విద్యుత్ అధికారులు ఎలాంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
విద్యుత్ శాఖలో బాగా పని చేసే వారినే ప్రోత్సహించేందుకు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
మొన్నటి భారీ వరదల సమయంలో అర్ధరాత్రి సైతం విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది పని చేశారన్నారు. అలాంటి వారిని గుర్తించాలన్నారు.
వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన 1912 టోల్ ప్రీ నంబర్ ను సంప్రదించ్చని తెలిపారు. డయల్ 1912 నెంబరుకు విస్కృతంగా ప్రచారం కల్పించాలని ఆయన సూచించారు.