Higher Educational Institutions Reservations : తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలోనూ ఐదేళ్ళ మినహాయింపు కల్పించింది.

దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల ప్రకారంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. దివ్యాంగులను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.
దివ్యాంగులకు (Higher Educational Institutions) ఐదు శాతం రిజర్వేషన్లు
దృష్టి లోపం–ఏ కేటగిరి, వినికిడి లోపం, మూగ-బీ కేటగిరి, అంగవైకల్యం-సీ, మానసిక వైకల్యం-డీ, ఒకటికి మించిన వైకల్యాలు-ఈ కేటగిరీలుగా విభజించారు. ఈ రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో కొనసాగనున్నాయి. ఒక కేటగిరిలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఆ రిజ ర్వేషను తదుపరి కేటగిరి అభ్యర్థులకు వర్తింపజేస్తారు.
ఉన్నత విద్య ప్రవేశాల్లో అసలు దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వుడు (ఎస్సీ, ఎస్సీ, బీసీ) వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ప్రకారం ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
School Education : పాఠశాల విద్య.. డిజిటల్ మోడ్లోలోకి