Sankranti Celebrations in Hyderabad Metro : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మెట్రో సంబురాలను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. మూడురోజులపాటు ‘మీ టైం ఆన్ మై మెట్రో క్యాంపస్’ పేరిట వేడుకలను నిర్వహించనుంది.

Sankranti Celebrations Hyderabad Metro Route
Pongal Celebrations Hyderabad Metro Route | Mega9.in

హైదరాబాద్ మెట్రో సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. జనవరి 8, 9, 10 తేదిల్లో పండుగ సంబురాలను నిర్వహించనుంది. మీ టైం ఆన్ మై మెట్రో క్యాంపస్ పేరిట మూడ్రోజులపాటు సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది.

ఎంజీబీఎస్ మెట్రో నుంచి సంక్రాంతి వేడుకలు (Sankranti Celebrations) ప్రారంభం..

ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి 2025 సంక్రాంతి సంబరాలను ప్రారంభించనున్నారు. ఈ వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు ఔన్యత్యం ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ ఏర్పాట్లను చేసింది.

Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం..

హైదరాబాద్ నగరంలోని పలు స్టేషన్ల పరిధిలో సంక్రాంతి సంబురాలను నిర్వహించనున్నారు. రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండటంతో మైట్రో ప్రయాణీకులు సైతం వీటిని తిలకించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

LOCAL BODY ELECTION : కొత్త ఏడాదిలో ‘స్థానిక’ సమరానికి ‘సై’..

Read Latest Telangana News and Latest News Updates

KHEL RATNA AWARDS 2024 : ఖేల్ రత్న అవార్డులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *