Saraswati River Pushkaralu 2025 Dates : కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతి నది పుష్కరాలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మే 15 నుంచి 12రోజులపాటు సరస్వతి నది పుష్కరాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

నేడు కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో మహా కుంభాభిషేకం కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు శ్రీధర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
త్రివేణి సంగమంగా ప్రసిద్ధి..
ఈ ప్రాంతం గోదావరి, ప్రాణహిత నదుల సంగమంతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ నదుల వల్ల అంతర్వాహినిగా సరస్వతి నది వెలసిందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కూడలిగా ఉన్న కాళేశ్వరం క్షేత్రానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిపారు.

ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ ప్రభుత్వాల సహకారం తీసుకుంటామన్నారు. కాళేశ్వరం అభివృద్ధి కోసం మాస్టర్ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
Saraswati River Pushkaralu 2025 కోసం.. 25కోట్ల మంజూరు
సరస్వతి నది పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 25కోట్ల నిధులను మంజూరు చేసింది. మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.
సరస్వతి నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులకు పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2013లో వచ్చిన సరస్వతీ నది పుష్కరాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించింది.
Health Tourism Hub : హెల్త్ టూరిజం హబ్ గా తెలంగాణ