Siricilla Netanna Yeldi Hariprasad : చేనేత కళాకారుడికి అరుదైన ప్రతిభకు గౌరవం దక్కింది. ప్రత్యేకమైన చేనేత కళతో అద్భుతాలు సృష్టించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన కళాకారుడు యెల్టి హరిప్రసాద్ కు డాక్టరేట్ దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Siricilla Netanna Yeldi Hariprasad
Handloom Artist Yeldi Hariprasad | Mega9.in

చేనేత రంగంలో బుల్లి మరమగ్గాలు, రాట్నాలు, అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, దబ్బునం లోంచి దూరే చీర, వెండి, బంగారు చీరలతోపాటు చేనేత మగ్గంపై ప్రముఖుల ముఖ చిత్రాలను నేసి దేశవ్యాప్తంగా అతని కళను చాటాడు.

అదేవిధంగా వస్త్రంపై జీ-20 లోగోను ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రశంసలు అందుకోవడంతోపాటు న్యూజిలాండ్ ప్రధాని మెప్పును సైతం పొందాడు.

చేనేత కళలో (Siricilla Netanna) అరుదైన గుర్తింపు..

అతడి నైపుణ్యం, సేవా కార్యక్రమాలను గుర్తించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ హరిప్రసాద్ కు డాక్టరేట్ ప్రదానం చేసింది.

సిరిసిల్ల చేనేత కళాకారుడికి డాక్టరేట్ అవార్డు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. కళా, రాజకీయ చెందిన పలువురు ప్రముఖులు హరిప్రసాద్ ను అభినందించారు.

Read more : Under-19 T20 World Cup : సెమీస్‌కు చేరిన భారత్

Health Tourism Hub : హెల్త్ టూరిజం హబ్ గా తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *