Rifle Shooter Surabhi Bhardwaj : ఉత్తరాఖండ్లో 38వ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో తెలంగాణ అమ్మాయి, షూటర్ సురభి భరద్వాజ్ సత్తా చాటారు.

ఫిబ్రవరి 3న జరిగిన 50మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో సురభి కాంస్య పతకం సాధించారు. ఫైనల్లో 448.8 స్కోరుతో సురభి భరద్వాజ్ మూడో స్థానంలో నిలిచారు.
స్టార్ షూటర్ సిఫ్ట్ కౌర్ (పంజాబ్) 461.2 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం పతకం గెలుపొందారు. పంజాబ్ కే చెందిన అంజుమ్ (458.7) స్కోరుతో రజతం సాధించారు.

సత్తా చాటిన (Surabhi Bhardwaj) సురభి.. సత్యజ్యోతి..
నేషనల్ గేమ్స్ 2025లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన షూటర్ సురభి భరద్వాజ్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఏపీకి చెందిన వెయిట్ లిప్టర్ సత్య జ్యోతి సైతం కాంస్యం గెలుచుకుంది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ సత్య జ్యోతి కాంస్య పతకం గెలుచుకుంది. 87+ కేజీల కేటగిరీలో ఆమె స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి మొత్తం 194 కిలోలు ఎత్తారు.
పంజాబ్ కు చెందిన మెహక్ శర్మ(247) స్వర్ణం, ఉత్తరప్రదేశ్ కు చెందిన పుమిమా పాండే (216) రజతం సాధించారు.
మరోవైపు పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, స్టార్ షూటర్ సరబోత్ సింగ్ పతకం గెలుచుకోకపోవడం గమనార్హం. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో పాల్గొన్న అతను నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో 198.4 స్కోరు చేశాడు.
కర్ణాటకకు చెందిన 15 ఏళ్ళ జోనాథన్ ఆంటోనీ సంచలనం సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో నేషనల్ చాంపియన్ గా నిలిచిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. ఫైనల్లో అతను 240.7 స్కోరుతో గోల్డ్ మెడల్ సొంతం చేసుకోవడం విశేషం.
Under-19 World Cup 2025 : మహిళల ప్రపంచ కప్ విజేత భారత్