CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడ్రోజులపాటు ఢిల్లీ, జైపూర్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో మూడ్రోజులపాటు సీఎం పర్యటన ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జైపూర్లోని బంధువుల వివాహ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరుకానున్నారు.

కేంద్ర మంత్రులతో.. సీఎం (Revanth Reddy Delhi Tour)..
బుధవారం ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి రేవంత్ రెడ్డి జైపూర్ వెళ్తారు. బంధువుల వివాహానికి హాజరై తిరిగి ఢిల్లీకి సీఎం చేరుకుంటారు. అనంతరం కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటి కానున్నారు.
Read Latest Telangana News and Latest News Updates