Bangalore to Hyderabad Route TGSRTC Special Discount : టీజీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు టూ హైదరాబాద్ రూట్లో టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ప్రత్యేక రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈమేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ ఛైర్మన్ వీసీ సజ్జనార్ తమ సంస్థ అందించే రాయితీ ప్రకటనను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీజీఎస్ఆర్టీసీ ప్రకటించిన ప్రత్యేక రాయితీ ప్రస్తుతం బెంగళూరు టూ హైదారాబాద్ ప్రయాణీకులకు మాత్రమే వర్తించనుంది. ఈ రూట్లో ప్రయాణించే వారికి పదిశాతం రాయితీ దక్కనుంది. దీని వల్ల ప్రయాణీకులకు టికెట్టుపై రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా కానుంది.

Bangalore to Hyderabad Route సక్సెస్ అయితే మరిన్ని రూట్లలోనూ..
ముందస్తు బుకింగ్ కోసం https://tgsrtcbus.in వెబ్ సైట్ సందర్శించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
టీజీఎస్ఆర్టీసీ ప్రకటించిన రాయితీ కేవలం బెంగళూరు టూ హైదరాబాద్ కే పరిమితం కావడంతో ఇతర ప్రధాన రూట్లలోనూ దీనిని అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక రాయితీకి మంచి ఆదరణ లభిస్తే.. త్వరలోనే మరిన్ని ప్రధాన రూట్లలోనూ దీనిని అమలు చేసే అవకాశం లేకపోలేదు.
ఏదిఏమైనా ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ తో పోలిస్తే ఆర్టీసీలో ప్రయాణించడం చాలా సురక్షితమైనందుకు ప్రయాణీకులు దీనిని వినియోగించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
Jio Hotstar : రెండు ప్రపంచాల కలయిక ‘జియో హాట్ స్టార్’
E FLYING BOAT : ఈ ప్లయింగ్ బోట్ ఆవిష్కరణ
విజయవాడ (Vijayawada Route) రూట్లో 10శాతం రాయితీ
హైదరాబాద్ టూ విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు.