Top 10 Monuments in India : ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తాజాగా దేశంలోని టాప్ టెన్ మాన్యుమెంట్స్ జాబితాను ప్రకటించింది. 2022-23 మరియు 2023-24 సంబంధించి పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన చారిత్రాక కట్టడాల జాబితాను విడుదల చేసింది.

ఇందులో హైదరాబాద్ నగరంలోని చారిత్రాక కట్టడాలైన గోల్కొండ కోట, చార్మినార్ లకు చోటు దక్కింది. గతేడాది గోల్కొండ కోటను 16.08 లక్షల మంది సందర్శకులతో 6వ స్థానంలో ఉంది. చార్మినార్ ను 12.90 లక్షల మంది సందర్శకులతో 9వ స్థానంలో నిలిచింది.
ఇండియాలోని టాప్ (Top 10 Monuments) మాన్యుమెంట్స్..
ఆర్కియలాజిక్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన టాప్ 10 మాన్యుమెంట్స్ జాబితాను పరిశీలిస్తే ఈకింది విధంగా ఉన్నాయి.
- తాజ్ మహాల్ (ఆగ్రా) తొలి స్థానంలో ఉంది. 2022-23 సంవత్సరంలో 50.53 లక్షల మంది పర్యాటకులు, 2023-24లో 60.99 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు.
- సూర్యదేవాలయం (కోణార్క్) రెండో స్థానంలో ఉంది. 2022-23లో 24.05 లక్షల మంది పర్యాటకులు, 2023-24లో 31.97 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు.
- కుతుబ్ మినార్ (ఢిల్లీ) మూడో స్థానంలో ఉంది. 2022-23లో 17.68 లక్షల మంది, 2023-24లో 31.24 లక్షల మంది సందర్శించారు.
- రెడ్ ఫోర్ట్ (ఢిల్లీ) నాలుగో స్థానంలో ఉంది. 2022-23లో 22.15 లక్షల మంది, 2023-24లో 27.94 లక్షల మంది సందర్శించారు.
- ఎల్లోరా గుహలు (ఔరంగాబాద్) ఐదో స్థానంలో ఉంది. 2022-23లో 14.38 లక్షలు, 2023-24లో 17.41 లక్షల మంది సందర్శించారు.
- గోల్కొండ కోట (హైదరాబాద్) ఆరో స్థానంలో ఉంది. 2022-23లో 15.27లక్షలు, 2023-24లో 16.08 లక్షల మంది సందర్శించారు.
- ఆగ్రా ఫోర్ట్ (ఆగ్రా) ఏడో స్థానంలో ఉంది. 2022-23లో 17.22లక్షలు, 2023-24లో 14.10 లక్షల మంది సందర్శించారు.
- రాబిస్ దురాణి టోంట్ (ఔరంగాబాద్) ఎనిమిదో స్థానంలో ఉంది. 2022-23లో 11.83 లక్షలు, 2023-24లో 12.95 లక్షల మంది సందర్శించారు.
- చార్మినార్ (హైదరాబాద్) తొమ్మిదో స్థానంలో ఉంది. 2022-23లో 9.29 లక్షలు, 2023-24లో 12.90 లక్షల మంది సందర్శించారు.
- శనివార్ వాడ (పూణే) పదో స్థానంలో ఉంది. 2022-23లో 10.8 లక్షలు, 2023-24లో 12.61 లక్షల మంది సందర్శించారు.
Miss World : పోటీల్లో పాల్గొనాలంటే ఉండాల్సిన అర్హతలెంటీ?
Jio Hotstar Records : భారత్ వర్సెస్ పాక్.. రికార్డ్ వ్యూయర్ షిప్