Tripti Dimri Popular in 2024 : ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ సంస్థ ప్రతి ఏడాది మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన మోస్ట్ పాపులర్ నటీనటుల లిస్ట్ విడుదల చేసింది. ఇందులో టాప్ 1 లో త్రిప్తి డిమి (Tripti Dimri) నిలిచింది.

ఈ ఏడాది ‘బ్యాడ్ న్యూజ్, లైలా, మజ్ను, భూల్ భూలయ్యా-3 సినిమాలు రిలీజు కావడంతో త్రిప్తి గురించి ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ చేసినట్లు పేర్కొంది.
రెండో స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, నటుడు ఇషాన్ ఖత్తర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు.

టాప్ 5లో శోభిత ధూళిపాళ నిలిచింది. ఆరు, ఏడు స్థానాల్లోశార్వరీ, ఐశ్వర్యరాయ్ ఉన్నారు. ఎనిమిదో స్థానంలో సమంత, తొమ్మిదో స్థానంలో అలియా భట్, పదో స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 250మిలియన్లకు పైగా సందర్శకుల వాస్తవపేజీ వీక్షణల ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగులను విడుదల చేసినట్లు ఐఎండీబీ పేర్కొంది.
Read Latest Entertainment News and Latest News Updates